క్రైమ్/లీగల్

వాహనం ఢీకొని యువకుని దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు, నవంబర్ 11: వెలగలేరులో భారీ వాహనం ఆదివారం ఢీకొన్న ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన పూసల బాలకోటేశ్వరరావు (28) మృతి చెందాడు. వెలగలేరులో రోడ్డు పక్కన నిల్చుని ఉన్న బాలకోటేశ్వరరావును మలుపు వద్ద టిప్పరు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు యువకుడిని విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరిన కొద్ది నిముషాలకే అతను మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంపై ఆగ్రహించిన గ్రామస్తులు మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని, వెలగలేరు గ్రామం నుంచి భారీ వాహనాలను అనుమతించరాదని డిమాండ్ చేస్తూ రాస్తారోకోకు దిగారు. విజయవాడలో దుర్గగుడి ఫ్లైఓవర్ పనులు ఆలస్యం కావడంతో మూడేళ్ళుగా వెలగలేరు గుండానే భారీ వాహనాలు తిరుగుతున్నాయి. ఇదంతా ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఆందోళన కారులు ఆరోపించారు. భారీ వాహనాలను ఊళ్ళోకి రానీయకుండా వెలగలేరులో పోలవరం కాలువ కట్టలపై ప్రత్యేకంగా రహదారిని నిర్మించి, అటుగుండా ట్రాఫిక్ మళ్ళించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. భారీ వాహనాల వల్ల ఇరుకైన రోడ్లపై ప్రమాదాలు జరుగుతున్నాయని, కాలుష్యంతో చస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వైసిపి సోషల్ మీడియా విభాగం కన్వీనర్ ఎర్రగుంట సుకుంద్, ఎమ్మార్పీఎస్ నాయకులు వైఎస్ రాజు, మండల శేఖర్‌బాబు తదితరులు ఆందోళన వ్యక్తం చేశారు. మైలవరం ఎఎంసి చైర్మన్ వుయ్యూరు నరసింహారావు, జెడ్పీటిసి కాజ బ్రహ్మయ్య, వైసిపి కన్వీనర్ మందా జక్రధరరావు, పోలీసులు, అధికారులు, నాయకులు గ్రామస్తులతో చర్చలు జరిపారు. మృతుని కుటుంబానికి రూ.5లక్షలు నష్టపరిహారం కింద చెల్లించేటట్లు, భారీ వాహనాలను వన్‌వేకి మాత్రమే అనుమతిస్తామని హామీలు ఇవ్వగా గ్రామస్తులు ఆందోళన విరమించారు. సుమారు 7గంటల పాటు జరిగిన రాస్తారోకో వల్ల భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.