ఆంధ్రప్రదేశ్‌

కృష్ణా, గుంటూరు జిల్లాలను ముంచెత్తిన వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కృష్ణానది వరద నీటికి కృష్ణా, గుంటూరు జిల్లాలు నీట మునిగాయి. వేలాది మంది నిరాశ్రయులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి దిగువకు వరద నీటి వదిలివేస్తున్నారు. విజయవాడలోని కృష్ణలంకలోని పలు కాలనీలు, గీతానగర్, రామలింగేశ్వర్ నగర్, బాలాజీ నగర్ తదితర ప్రాంతాలు నీట మునిగాయి. కలెక్టర్ ఇంతియాజ్, మున్సిపల్ కమిషనర్ నగరంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు సమీక్షిస్తున్నారు. వరద నీటికి పులిగడ్డ అక్విడెక్ట్ పూర్తిగా నీటి మునిగింది. పులిగడ్డపాలెంలోకి వరద నీరు చేరి వంద ఇళ్లు నీటమునిగాయి. అలాగే ఇబ్రహీంపట్నంలో వరద నీరు పెరగటంతో అక్కడ చిలుకూరు, దాములూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రకాశం బ్యారేజీ నుండి సుమారు 9లక్షల క్యూసెక్కుల మేర వరద నీటిని దిగువకు విడుదల చేయటంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభిస్తున్నాయి. 160 మంది ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. లంక గ్రామాల్లోని పల్లపు ప్రాంతాల్లోని భూముల్లో వరద నీరు ప్రవేశించటంతో వందలాది ఎకరాల్లోని కంద, పసుపు, మొక్కజొన్న, అరటి, కూరగాయల పంటలు రెండు రోజులుగా నీటిలో నానుతున్నాయి. లంక గ్రామాల్లో కొన్నిచోట్ల వరద ఉధృతికి విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. కృష్ణా జిల్లాలో మొత్తం 41 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయగా 8వేల 100 మందికి ఆశ్రయం కల్పించారు. 35 మెడికల్ క్యాంప్‌లను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. గుంటూరు జిల్లా కొల్లూరు, కొల్లిపొర మండలాల పరిధిలోని 15 గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. అరవింద వారధి వద్ద గండి కారణంగా కృష్ణా కరకట్ట వరకు నీరు చేరింది. అమరావతి, బెల్లంకొండ, అచ్చంపేట మండలాల్లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. గుంటూరు జిల్లా పెద్దమద్దూరు వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.