కృష్ణ

మరో మైలురాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూలై 23: బందరు పోర్టు, అనుబంధ పరిశ్రమల స్థాపనలో మరో మైలురాయి పడింది. ఏడాది క్రితం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌ను ల్యాండ్ పూలింగ్ (్భసమీకరణ)గా మారుస్తూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని శనివారం ప్రభుత్వం జీవో నెం. 185 రూపంలో విడుదల చేసింది. మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (మడ) ద్వారా భూముల సమీకరణకు రంగం సిద్ధమైంది. గత ఆగస్టులో విడుదల చేసిన భూసేకరణ నోటిఫికేషన్ సమయంలో భూముల క్రయ, విక్రయాలపై విధించిన నిషేధాన్ని కూడా ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఈప్రాంత రైతుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. రిజిస్ట్రేషన్లపై నిషేధం ఉండటంతో ఇప్పటివరకు రైతులు తమ అవసరాలకు భూములను అమ్ముకోలేకపోయారు. ప్రస్తుతం నిషేధాన్ని ఎత్తివేయటం రైతులకు కొంత ఊరట ఇచ్చినట్లైంది. బందరు పోర్టు విషయంలో పట్టుదలతో ఉన్న ప్రభుత్వం ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను సైతం పక్కనపెట్టి ముందుకు సాగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పోర్టు నిర్మాణంపై దృష్టి సారించి ఒక్క పోర్టుతోనే అభివృద్ధి సాధ్యం కాదంటూ అనుబంధ పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగానే 33వేల ఎకరాల భూమిని సేకరించేందుకు గత సంవత్సరం ఆగస్టు 31న భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. దీనిపై రైతుల నుండి పెద్దఎత్తున వ్యతిరేకత రావటంతో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు గ్రామగ్రామాన పర్యటించి రైతులను ల్యాండ్ పూలింగ్‌కు ఒప్పించారు. రాజధానికి అమరావతిలో ఏవిధంగా భూములు సమీకరించారో అదే విధానాన్ని బందరులో కూడా అవలంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు సిఆర్‌డిఏ మాదిరిగా గత ఫిబ్రవరిలో మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (మడ) ఏర్పాటు చేశారు. మడ ద్వారా ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు తీసుకోవటంతో పాటు అన్ని వసతులతో కూడిన మెగా టౌన్‌షిప్ నిర్మించనున్నారు. పోర్టు కోసం భూములిచ్చిన రైతులకు సిఆర్‌డిఏ తరహా ప్యాకేజీని ఇక్కడ కూడా అమలు చేస్తామని ప్రభుత్వం జారీ చేసిన 185 జీవోలో పేర్కొన్నారు. భూముల సేకరణపై ప్రతిపక్షాలు పెద్దఎత్తున దుమారం సృష్టించినా ప్రభుత్వం ఎక్కడా వెనుకడుగు వేయకుండా ల్యాండ్ పూలింగ్ దిశగా అడుగులు వేసింది. ఈ నెల 8న జరిగిన మంత్రివర్గ సమావేశంలో మడ ద్వారా ల్యాండ్ పూలింగ్‌కు వెళ్లాలని నిర్ణయించగా రెండు వారాలకే జీవో విడుదల చేయడం విశేషం. ఇప్పటికే పోర్టు, పరిశ్రమల స్థాపనకు అనువైన భూములను గుర్తించిన ప్రభుత్వం త్వరలోనే ల్యాండ్ పూలింగ్‌కు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. జీవో జారీ చేయడం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు శనివారం రాత్రి కోనేరుసెంటరులో సంబరాలు చేశారు. టిడిపి సీనియర్ నాయకులు కొనకళ్ళ జగన్నాథరావు, గొర్రిపాటి గోపిచంద్, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీవిశ్వనాథం, తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు.
సువర్ణావకాశమిది:మంత్రి రవీంద్ర
బందరు పోర్టు, పరిశ్రమల స్థాపన బందరు వాసులకు ఓ సువర్ణావకాశమని, దీన్ని చేజార్చుకోవద్దని మంత్రి కొల్లు రవీంద్ర రైతులను కోరారు. శనివారం రాత్రి ఆయన ‘ఆంధ్రభూమి ప్రతినిధి’తో మాట్లాడుతూ ఏ రైతుకీ అన్యాయం జరగకుండా ల్యాండ్ పూలింగ్ ఉంటుంన్నారు. సిఆర్‌డిఏ తరహా ప్యాకేజీ అమలుకు అంగీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రైతులంతా రుణపడి ఉంటారన్నారు. త్వరలోనే ప్రముఖ కంపెనీతో మాస్టర్ ప్లాన్ తయారు చేయిస్తామని మంత్రి రవీంద్ర వివరించారు.

నాగాయలంకలో దేవినేని, మండలి నదీహారతి
నాగాయలంక, జూలై 23: స్థానిక శ్రీరామపాద క్షేత్రం వద్ద కృష్ణా తీరాన పుష్కరాలను పురస్కరించుకుని సమరసత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నదీ హారతి కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు, ఉప సభాపతి, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్‌కు జలహారతి ఇచ్చారు. ఈసందర్భంగా శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఎఎంసి ఛైర్మన్ మండవ బాలవర్ధనరావు, జిల్లా తెలుగుయువత కార్యదర్శి తలశిల రామకృష్ణ చౌదరి దుశ్శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. జిల్లా తెలుగుమహిళ కార్యదర్శి తలశిల స్వర్ణలత నేతృత్వంలో మహిళలు దేవినేనికి, మండలికి హారతి ఇచ్చారు. అనంతరం వేలాది మంది మహిళలు పాల్గొన్న నదీ హారతి కార్యక్రమంలో ఉమామహేశ్వరరావు, బుద్ధప్రసాద్ పాల్గొన్నారు. స్థానిక, పరిసర గ్రామాలకు చెందిన వేలాది మంది మహిళలు పాల్గొని నాయకుల నేతృత్వంలో నదీ హారతి ఇచ్చారు. ఈసందర్భంగా మంత్రి దేవినేని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గోదావరి పుష్కరాలకు దీటుగా కృష్ణా పుష్కరాలను నిర్వహిస్తోందన్నారు. ఇందుకు కోట్లాది రూపాయల నిధులతో యాత్రీకుల సౌకర్యార్ధం పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు.
జిల్లాలో విజయవాడలోనే కాకుండా ముత్యాల, హంసలదీవి, పెదకళ్ళేపల్లి, తదితర ప్రాంతాలలో పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిందన్నారు. నాగాయలంక పుష్కరఘాట్‌ను మునె్నన్నడూ లేనివిధంగా సుందరంగా తీర్చిదిద్దారని, పుష్కరాల సందర్భంగా ప్రజలు వేలాదిగా పాల్గొని నదీ ప్రాశస్త్యాన్ని తెలుసుకుని ధన్యులు కావాలని కోరారు. దివిసీమలో పుష్కరాలకు సంబంధించి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను బుద్ధప్రసాద్ ప్రత్యేక శ్రద్ధతో అమలు పరుస్తున్నారన్నారు. ఉప సభాపతి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా పుష్కరాల నిర్వహణను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని వివరించారు.

రాష్ట్ర బిసి కార్పొరేషన్ డైరెక్టర్ల
సమాఖ్య కో-కన్వీనర్‌గా వెంకన్న
బంటుమిల్లి, జూలై 23: రాష్ట్ర బిసి కార్పొరేషన్ డైరెక్టర్ల సమాఖ్య కో-కన్వీనర్‌గా తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బొల్లా వెంకన్న ఎంపికయ్యారు. విజయవాడలో జరిగిన రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ల డైరెక్టర్ల సమాఖ్య సమావేశంలో ఆయనను ఎన్నుకున్నారు. ఈసందర్భంగా వెంకన్న మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తానని, వివిధ కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం అందించే నిధులు అర్హులకు అందేలా కృషి చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషికి సమాఖ్య అన్నివిధాలా సహకరిస్తుందన్నారు. తనను కో-కన్వీనర్‌గా ఎన్నుకున్న అన్ని కార్పొరేషన్ల డైరెక్టర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

పట్టిసీమ లేకపోతే కృష్ణాడెల్టా బీడే..
చల్లపల్లి, జూలై 23: పట్టిసీమ నీరు లేకుంటే కృష్ణాడెల్టా బీడుగా మారేదని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆగస్టు నాటికి సైతం శ్రీశైలం నీరు వచ్చే పరిస్థితి లేదని జిల్లా తెలుగురైతు అధ్యక్షులు చలసాని ఆంజనేయులు అన్నారు. పట్టిసీమ ద్వారా మళ్లించిన గోదావరి జలాలను మండల పరిధిలోని నిమ్మగడ్డ లాకులు వద్ద పూజలు చేసిన అనంతరం ఆయన కాలువలకు విడుదల చేశారు. మూడు గేట్లను అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. కృష్ణాడెల్టా ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ డి శివరామకృష్ణ, చల్లపల్లి, ఘంటసాల డిసి అధ్యక్షులు ఎన్ దిలీప్‌కుమార్, ఎస్ ప్రసాద్, ఇరిగేషన్ డిఇ వేణుగోపాల్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

పవిత్ర సంగమం ప్రాంతంలో
మెగాస్క్రీన్ ప్రదర్శనలు
కలెక్టర్ బాబు ఎ
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జూలై 23: పవిత్ర సంగమం ప్రాంతంలో చేపడుతున్న ప్రతిష్టాత్మకమైన ఘాట్ల నిర్మాణం ద్వారా పుష్కర యాత్రికులకు సౌకర్యవంతమైన పుష్కర స్నానాన్ని అందుబాటులోకి తీసుకురావడం కోసం భారీ ఏర్పాట్లను చేపడుతున్నామన్నారు. స్థానిక ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమంను శనివారం కలెక్టర్ పరిశీలించారు. పవిత్ర సంగమం పాయింట్‌లో 2 ప్రాంతాల్లో జరుగుతున్న సమాంతర పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా టూరిజం ఇడి ఎం బాలసుబ్రహ్మణ్యం, జిఎం టి సూర్యప్రకాశరావు, రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్ అండ్ బి తదితర అధికార సిబ్బంది కాంట్రాక్టర్లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాబు ఎ మాట్లాడుతూ 12 రోజులు ఈ ప్రాంతం నుండే పరిశీలన చేస్తారని, ఇక్కడే బస చేస్తారని తెలిపారు. ఈ ప్రాంతానికి కృష్ణా - గోదావరి నదుల అనుసంధానం ద్వారా ఏర్పడిన ప్రాముఖ్యత దృష్ట్యా మెగాస్క్రీన్స్ ఏర్పాటు చేసి పుష్కర సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతోపాటు వివిధ ప్రదర్శనలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ ప్రదర్శనలో భాగంగా ప్రతి రోజు సాయంత్రం 3 లేజర్‌షోలను నిర్వహించేలాగా చర్యలు చేపట్టాలని ప్రతినిధులను సూచించారు.

ఘాట్ల నిర్మాణాల్లో సమయపాలన ముఖ్యం
కలెక్టర్ బాబు ఎ
* పిఆర్‌డి ఇవో సస్పెన్షన్‌కు ఆదేశాలు జారీ
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జూలై 23: దుర్గాఘాట్, మోడల్‌గెస్ట్ హౌస్ ప్రాంతాల్లో చేపడుతున్న ఘాట్ నిర్మాణ పనుల్లో సమయపాలనతో పాటు పటిష్టతకు, నాణ్యతకు సమాంతర ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని కలెక్టర్ బాబు ఎ తెలిపారు. శనివారం రాత్రి దుర్గాఘాట్‌లో, మోడల్‌గెస్ట్ హౌస్ ప్రాంతాల్లో జరుగుతున్న పనులను ఆయా ఘాట్ ఇన్‌చార్జి అధికారిగా ఉన్న జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, అసిస్టెంట్ కలెక్టర్ డికె బాలాజీ, సోమా ప్రతినిధులు, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఘాట్‌లో చేపడుతున్న పనుల శైలితోపాటు, విశాలమైన ఘాట్లలో భద్రతతో కూడిన నిర్మాణాలను చేపట్టాల్సి ఉందన్నారు. మోడల్ గెస్ట్‌హౌస్ ప్రాంతంలో చేపడుతున్న ముఖ్యమంత్రి కంట్రోల్ రూమ్ నిర్మాణాల ప్రగతిని కలెక్టర్ పరిశీలించి 31 నాటికల్లా పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మెట్ల నిర్మాణం, రిటైనింగ్‌వాల్ నిర్మాణం తదితర నిర్మాణాలపై కలెక్టర్ బాబు ఎ, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు సూచనను చేశారు. నిరుపయోగంగా ఉన్న ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న మెట్లను తక్షణం తొలగించాలని దుర్గగుడి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను కలెక్టర్ ఆదేశించారు. రామవరప్పాడు రింగ్‌రోడ్డు పరిధిలోని ఆక్రమణలను తొలగించి మేలైన రవాణా సదుపాయానికి చర్యలు తీసుకుంటే ఆ ప్రాంతాన్ని డంపింగ్ యార్డుగా మార్చడంపై సంబంధిత ఇవో పిఆర్‌డిని తక్షం సస్పెండ్ చేయాలని ఎంపిడిఓను ఆదేశించారు.