కృష్ణ

భావితరాలకు ఉపయోగపడేలా పుష్కర ఘాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, జూలై 23: భావితరాలకూ ఉపయోగపడేలా కృష్ణా పుష్కర ఘాట్లను ఆధునీకరిస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. అవనిగడ్డ శివారు కొత్తపేట, హంసలదీవిలోని సాగర సంగమం, నాగాయలంక పుష్కర ఘాట్లను పరిశీలించిన ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడారు. శాసనసభ ఉప సభాపతి బుద్ధప్రసాద్ చొరవతో అవనిగడ్డ ఘాట్‌ను రూ.32 లక్షల నుండి రూ.88 లక్షలకు అంచనాలు పెంచటం ద్వారా ఆధునీకరిస్తున్నామన్నారు. కొత్తపేట పుష్కరఘాట్‌లో గాంధీజీ, కంచికామకోటి పీఠాధిపతులు పుణ్యస్నానాలు చేయటం ద్వారా ఇక్కడి ప్రజలను పునీతం చేశారని, ఈ విషయాన్ని భావితరాలకు చెప్పటం తమ ప్రధాన ధ్యేయమన్నారు. కోడూరు మండలంలోని సాగరసంగమం పుష్కర ఘాట్‌లో శనివారం నుండి కృష్ణానదికి నిత్య హారతి ఇవ్వనున్నట్లు తెలిపారు. అమరావతిలో మూడు కిలోమీటర్ల పొడవున స్నాన ఘట్టాలు నిర్మిస్తున్నామని, ఈవిధంగా రివర్ ఫ్రంట్ పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందన్నారు. కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని పులిచింతల వద్ద 2.5 టిఎంసిల కృష్ణా జలాలను ముఖ్యమంత్రి చొరవతో నిల్వ చేశామని, ప్రతిరోజూ 925 క్యూసెక్కుల నీటిని పట్టిసీమ నుండి విడుదల చేస్తున్నామన్నారు. 24 మోటార్ల ద్వారా పట్టిసీమ నుండి సాగునీరు వస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏమాత్రం వరద వచ్చినా 80 టిఎంసిల సాగునీరు మనకు వస్తుందని, దీంతో రూ.2,500 కోట్ల విలువైన పంటలను సంరక్షించుకునే అవకాశం ఉందన్నారు. సాగర సంగమంలో నిర్వహించే హారతి, సాంస్కృతిక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే అవకాశాలు ఉన్నాయని దేవినేని వెల్లడించారు. ఉప సభాపతి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ కొత్తపేటలోని పుష్కర ఘాట్‌కు మరో రూ.38 లక్షలు కేటాయించటం ద్వారా టైల్స్, ప్లాట్‌ఫారం నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. ఈ నెలాఖరుకు పుష్కరఘాట్ నిర్మాణం పూర్తవుతుందన్నారు. ఈసందర్భంగా మంత్రి ఉమను దుశ్శాలువాతో బుద్ధప్రసాద్ ఘనంగా సత్కరించారు. జెడ్పీటిసి వెంకటేశ్వరరావు, ఎంపిపి కనకదుర్గ, యాసం చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు.