కృష్ణ

పుష్కరఘాట్లపై ఐఎఎస్ అధికారి నేతృత్వంలో మల్టీడిసిప్లిన్ టీమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 3: ఘాట్ల అన్నింటిలో మల్టీ డిసిప్లిన్ టీమ్‌ను ఒక ఐఎఎస్ అధికారి లేదా డెప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో నియమిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు చెప్పారు. స్థానిక జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన అధికార్ల సమావేశంలో జెసి పలు సూచనలు చేశారు. పుష్కర యాత్రికులకు సేవలందించే అన్ని ప్రభుత్వశాఖల అధికార్లు ఈ బృందంలో సభ్యులుగా ఉంటారన్నారు. ఈ బృందానికి నాయకత్వం వహించే అధికార్లకు జాతీయ విపత్తు నివారణ చట్టం 2005 ప్రకారం మెజిస్ట్రీరియల్ అధికారాలు డెలిగేట్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
ప్రతి ఘాట్‌లోను 20 మంది అధికార్లు ఉండే మల్టిడిసిప్లిన్ టీమ్, ఇన్మర్మేషన్ ఫెసిలిటేషన్ సెంటర్, మెడికల్ టీమ్, దుస్తులు మార్చుకునే గదులు, పిండ ప్రదానం ప్లాట్ ఫోరంలు, ఫైర్, అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంటాయన్నారు. ఒక ఘాట్‌కు చెందిన ఆయా శాఖల బృందాలన్నింటితో ఈ నెల 5న ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చిస్తారన్నారు.
పిల్లల రిజిస్ట్రేషన్ కౌంటర్లు
పుష్కరాలకు వచ్చే యాత్రికులు తమ పిల్లల పేర్లను పుష్కరనగర్‌లలో, పుష్కరఘాట్‌లో ఉన్న పిల్లల రిజిస్ట్రేషన్ కౌంటర్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ సెంటర్లు ఐసిడిఎస్ సిబ్బంది ఆధ్వర్యంలో పని చేస్తాయన్నారు. ఇలా నమోదు చేసుకొన్న పిల్లల చేతికి ట్యాగ్ వేస్తారని, ఈ ట్యాగ్‌కు ప్రత్యేక నెంబరు ఇచ్చి, తల్లిదండ్రుల వివరాలు, వారి ఫోను నెంబర్లు రిజిస్టర్‌లో నమోదు చేసుకుంటారన్నారు. ఒక వేళ పిల్లలు తప్పిపోతే, వారి చేతికున్న ట్యాగ్‌పై ఉన్న నెంబరు, రిజిస్టర్ ఉన్న వివరాల ఆధారంగా వారి తల్లిదండ్రుల చెంతకు చేరుస్తారన్నారు. పిల్లల చేతికి వేసే ట్యాగ్‌పై వారి తల్లిదండ్రుల ఫోను నెంబరు కూడా వేయడం జరుగుతుందన్నారు. ఈ నెంబర్ల ఆధారంగా యాత్రికులెవరైనా వారిని వారి తల్లిదండ్రులకు అప్పగించే వీలుందన్నారు. సమావేశంలో డిఆర్‌డివో సిహెచ్ రంగయ్య, అసిస్టెంట్ కలెక్టర్ బాలాజి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

పుష్కరాలకు విస్తృతంగా
కమ్యూనికేషన్ ఏర్పాట్లు
* కృష్ణానదీ తీరంలో 43 కొత్త టవర్లు
* మొబైల్ ఫోన్‌లకు అనూహ్యంగా పెరుగుతున్న ఆదరణ
* బిఎస్‌ఎన్‌ఎల్ జిల్లా ప్రిన్సిపల్ జీఎం పూర్ణచంద్రరావు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఆగస్టు 3: కృష్ణా పుష్కరాల సందర్భంగా యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా కమ్యూనికేషన్ సౌకర్యాన్ని విస్తరింప చేస్తున్నామని బిఎస్‌ఎన్‌ఎల్ కృష్ణాజిల్లా నూతన ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ ఎ పూర్ణచంద్రరావు తెలిపారు. కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకేసారి 20 లక్షల మంది సెల్‌ఫోన్‌ను వినియోగించుకున్నప్పటికీ జామ్ కాకుండా ఉండేందుకై ఇప్పటికే కొత్తగా 27 టవర్లు ఏర్పాటు చేసామని, పుష్కరాలు ప్రారంభం లోపు మరో 16 టవర్లను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. బస్, రైల్వే స్టేషన్‌లు, పుష్కరనగర్‌లలోనూ మొబైల్, లాండ్ పబ్లిక్ టెలిఫోన్, సెల్‌ఫోన్ బూత్‌లను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. జిల్లాలో 184 టెలిఫోన్ ఎక్చేంజ్‌లున్నాయని అలాగే లక్షా, 17వేల ల్యాండ్ ఫోన్ కనెక్షన్‌లున్నాయని, అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కొత్తగా 39,450 మొబైల్ వినియోగదారులు చేరగా వీరితో కలిసి మొత్తం 5,73,700 మందికి వీరి సంఖ్య చేరిందన్నారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రూ. 70లు వరకు టాక్‌టైమ్‌ను పెంచడం జరిగిందన్నారు. ల్యాండ్ ఫోన్‌లకు రాత్రి వేళ ఉచితంగా మాట్లాడుకునే అవకాశం కల్పించడంతో డిస్ కనెక్షన్‌లు తగ్గాయని అన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం గృహ నిర్మాణ పథకంలో లబ్ధిదారుల ఎంపికకు ల్యాండ్ ఫోన్ కల్గిన వారు అనర్హులనే నిబంధన తమ దృష్టికి వచ్చిందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నెలకు 150లకే ఫైబర్ నెట్ కనెక్షన్ పథకం వల్ల తమ వ్యాపారానికి గట్టిపోటీ నివ్వగలదన్నారు. దశల వారీగా 4, 5 జిబి సామర్ధ్యాన్ని అందించబోతున్నామన్నారు. టవర్లు ఏర్పాటును పలు చోట్ల ప్రజలు వ్యతిరేకిస్తుండటాన్ని ప్రస్తావిస్తూ వీటి వల్ల రేడియేషన్ ప్రమాదం లేదని శాస్ర్తియంగా నిర్ధరించబడిందని అయితే ప్రజల్లో అవగాహనను మరింత పెంచాల్సి ఉందన్నారు. ప్రస్తుతం మొబైల్ విభాగంలో స్టూడెంట్ స్పెషల్ మొబైల్ ప్రీపెయిడ్, పర్ సెకన్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు, నేస్తం, అమూల్య ప్లాన్‌లు బహుళ ప్రాచుర్యం పొందుతున్నాయని అన్నారు. విలేకర్ల సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.