కృష్ణ

కౌంట్ డౌన్ - 5 పుష్కరాలకు ఏర్పాట్లు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 6: మూడున్నర కోట్ల మందిని దృష్టిలో ఉంచుకుని పుష్కరాల ఏర్పాట్లను నగరంలో చేసినట్లు కలెక్టర్ బాబు ఎ చెప్పారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మీడియాను ఉద్దేశించి పుష్కర యాత్రికులకు నగరంలో ఏర్పాటు చేసిన సౌకర్యాల గురించి వివరించటం జరిగింది. భద్రతా చర్యలలో భాగంగా ఆధార్‌తో అనుసంధానమైన ఐడి కార్డులు 60 వేల మందికి ఇవ్వటం జరుగుతుందని, ఇవి కాకుండా ఎన్జీవోలు, విద్యార్థులకు, వలంటీర్లకు 40 వేల వరకు ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. పుష్కరాల సందర్భంగా అందరూ సహకరించాలని మీడియా కూడా యాత్రికులకు సహకరించాలని ఇది అందరి పండుగని చెప్పారు. కృష్ణా పుష్కర భక్తులు దాదాపు 3 నుంచి 4 కోట్ల మంది వస్తారని అంచనా ఉందని చెప్పారు. దానికి అనుగుణంగా ఘాట్ల నిర్మాణం జరిపినట్లు తెలిపారు. అధికారులకు శుక్రవారం విధి విధానాలు వివరించటం జరిగిందని, ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కూడా హాజరయ్యారన్నారు. ప్రతి ఘాట్‌లో కూడా ఒక డెప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో టీమ్‌లు పనిచేస్తాయన్నారు. ఆయన కింద మూడు టీంలు పనిచేస్తాయన్నారు. ఘాట్స్‌కి దగ్గరలో పిండ ప్రదానం చేసే షెడ్స్ నిర్మించినట్లు చెప్పారు. పిండ ప్రదానానికి ఎంత రేట్లు తీసుకోవాలో కృష్ణా పుష్కరం వెబ్‌సైట్‌లో పొందుపరచినట్లు చెప్పారు. అదేవిధంగా మల్టీ డిసిప్లెనరీ టీంలు (ఎండిటి) అందుబాటులో ఉంటాయని, డ్రస్ మార్చుకొనడానికి రూములు నిర్మించినట్లు చెప్పారు. అదేవిధంగా మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లతో మీటింగ్ ఏర్పాటు చేసి భక్తులు మాట్లాడేటప్పుడు వచ్చే జామ్‌ని కూడా తట్టుకునే విధంగా ఇంట్రా సర్కిల్ రోమింగ్‌కి అవకాశం ఇచ్చినట్టు చెప్పారు.
క్రౌడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా రవాణాలో శాటిలైట్ బస్‌స్టేషన్స్‌ను అందుబాటులోకి తీసుకురావటం జరుగుతుందన్నారు. పుష్కరనగర్‌లో సకల సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని, అక్కడ పుష్కర యాత్రికులకు వసతి, భోజనం, టిఫిన్ సహా అన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నగరంలో 74 పుష్కర నగర్స్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇవేకాకుండా వాటర్ ప్యాకెట్స్, మంచినీళ్ల బాటిల్స్, మజ్జిగ పాకెట్స్ కూడా కల్పించనున్నట్లు చెప్పారు. ఎమర్జెన్సీ కోసం పద్మావతి ఘాట్‌లో ఆరు బెడ్స్ అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు.
నగరంలో 400 సిసి కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైల్వే వారు 200, స్మార్ట్ సిటీలో భాగంగా 11 సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. మామూలుగా సిసి టివీలు వన్‌వే కమ్యూనికేషన్ అని ఈ సిసి కెమెరాలు టూవేస్ అని అన్నారు. నగరంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం, పవిత్ర సంగమం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. యాప్రాన్‌లో ఫుడ్ కోర్టులు, టెంట్‌లు ఏర్పాటు చేసి నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వపరంగా మూడు హెలికాప్టర్స్ ఏర్పాటు చేస్తున్నట్టు, ఇంకా రెండు హెలికాప్టర్స్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇవి సామాన్యులకు కూడా అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. నగరంలో 136 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

‘గుత్తికొండ’ సేవలు స్ఫూర్తిదాయకం
మచిలీపట్నం (కల్చరల్), ఆగస్టు 6: గుత్తికొండ రమారత్నం సామాజిక సేవలు స్ఫూర్తిదాయకమని శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. స్థానిక ఆర్‌కె ప్యారడైజ్‌లో శనివారం గుత్తికొండ రమారత్నం చారిటబుల్ ట్రస్టు ద్వితీయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ తమవంతు బాధ్యతగా సామాజిక సేవలో పాల్గొనాలన్నారు. మనం చేసే సేవా కార్యక్రమాలే చిరస్థాయిగా మిగులుతాయన్నారు. రమారత్నం భౌతికంగా దూరమైనా ఆమె సేవలు ఎప్పుడూ గుర్తుండిపోతాయన్నారు. జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు సాహితీ జీవనం ‘గమనం’ గ్రంథాన్ని హిందీ సంస్థాన్ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆవిష్కరించారు.