కృష్ణ

అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రం మచిలీపట్నంలో సోమవారం అధికారికంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలతో పాటు తెలుగుదనం ఉట్టిపడేలా నిర్వహించిన సంక్రాంతి సంబరాలు మచిలీపట్నంకే శోభను తీసుకు వచ్చాయి. హిందూ కళాశాల ఆవరణలో కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ స్వీయ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ సంబరాల్లో అన్ని శాఖ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సాంప్రదాయ వస్త్రాలంకరణలో వేడుకలకు హాజరైన అధికారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే అధికారులంతా సాంప్రదాయ క్రీడలు ఆడి ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సంస్కారం లేని జీవితం తెగిన గాలిపటంతో సమానమన్నారు. ఈ సంక్రాంతి పతంగులు మనకు చెబుతున్న ఒక పాఠం లాంటిదని వివరించారు. తెలుగువారి ఇంట సంక్రాంతి పెద్ద పండుగ అని, పండుగను ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్నదని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకుని వారి కళ్లల్లో సంక్రాంతి వెలుగు చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కలెక్టర్ ఎఎండీ ఇంతియాజ్, కైకలూరు శాసనసభ్యుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్), జాయింట్ కలెక్టర్ డా. కె మాధవీలత, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రవీంద్రనాధ్‌బాబు ఎడ్లబండి ఎక్కి సంక్రాంతి సంబరాలను లాంఛనంగా ప్రారంభించారు. సంక్రాంతి పొంగల్ వండే ప్రదేశం, బొమ్మల కొలువు, భోగి పళ్లు పోసే ప్రాంతాలను అధికారులు, ప్రజాప్రతినిధులు తిలకించి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం జిల్లాలోని వివిధ అధికారులతో గాలి పటాలు, గోళీలు, బిళ్లం గోడు, వాలీబాల్, కబడ్డీ, సంక్రాంతి లక్ష్మీ తదితర ఆటల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తక్కువ సమయంలో ఇంత విజయవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా అధికారులను కలెక్టర్ ఇంతియాజ్ ప్రశంసించారు. అరిసెలు, జంతికలు, పూర్ణాలు వంటి తినుబండారాలను రుచి చూశారు. తొలుత భోగి మంటలను సాంప్రదాయ బద్ధంగా వెలిగించారు. కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా ప్రజలు భోగ భాగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఇంత ఉత్సాహంగా జరిగిన ఈ సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో పాల్గొనటం మొదటి సారి అని తన అనుభవాన్ని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై దేవుని దీవెనలు ఉన్నాయన్నారు. సకాలంలో వర్షాలు కురవడంతో పాడి పంటలతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన జానపద, శాస్ర్తియ నృత్యాలు ఆహుతులను అమితంగా అలరించాయి. అవనిగడ్డ ప్రగతి విద్యాలయానికి చెందిన 15మంది విద్యార్థినీ విద్యార్థులు కర్రసాముతో అందరినీ ఆకట్టుకున్నారు. ఘంటసాలకు చెందిన శ్రీకాకుళేశ్వర భక్త బృందం, పాపవినాశనం గ్రామానికి చెందిన కోలాట బృందం చేసిన కోలాటం ఆకట్టుకుంది. అలాగే శాస్ర్తియ సంగీతం, కూచిపూడి నృత్యం, డప్పు గీతాలు అలరించాయి. హిందూ కళాశాలలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలు, గొబ్మెమ్మల పాటలు, కొమ్ముదాసరి, బుడబుక్కలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల అటలు, తప్పెటగుళ్లు, యడ్లబళ్లు, చక్క భజనలు తదితర ప్రదర్శనలు ప్రజలు తిలకించి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్-2 మోహన్ కుమార్, ముడా వీసీ విల్సన్‌బాబు, జడ్పీ సీఇఓ సూర్యప్రకాశరావు, డీఆర్‌డీఎ పీడీ శ్రీనివాస్, ఆర్డీఓ ఎన్‌ఎస్‌కె ఖాజావలి, డ్వామా పీడీ జివి సూర్యనారాయణ, మెప్మా పీడీ డా. ఎన్ ప్రకాశరావు, డీపీఓ జె అరుణ, మున్సిపల్ కమీషనర్ శివరామకృష్ణ, బీసీ వెల్ఫేర్ డీడీ భార్గవి, సివిల్ సప్లైయ్ డీఎం రాజ్యలక్ష్మి తదితర అధికారులు పాల్గొన్నారు.

ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని కోసం టీడీపీ ర్యాలీ
చల్లపల్లి, జనవరి 13: ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కావాలని, మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. సాయంత్రం స్థానిక రామానగరం నుండి ప్రారంభమైన ర్యాలీ చల్లపల్లి ప్రధాన రహదారుల వెంట సాగింది. మహిళలు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొని రాష్ట్ర రాజధాని అమరావతికై నినదించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మోర్ల రాంబాబు, ముమ్మనేని రాజ్‌కుమార్, యార్లగడ్డ శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, రావెళ్ల విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

నేటి సీఎం పర్యటనకు
బందోబస్తు ఏర్పాట్లపై సమీక్ష
గుడివాడ, జనవరి 13: సీఎం జగన్మోహనరెడ్డి మంగళవారం గుడివాడ పర్యటనకు సంబంధించి బందోబస్తు ఏర్పాట్లపై సోమవారం జిల్లా ఎస్పీ రవీంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ రవీంద్రబాబు మాట్లాడుతూ పోలీస్ అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు. అనంతరం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానితో కలిసి ఎస్పీ రవీంద్రబాబు సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. సీఎం జగన్ సోమవారం సాయంత్రం 3.05 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుండి హెలికాప్టర్‌లో బయలుదేరి 3.15 గంటలకు గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుండి మెయిన్ రోడ్డు, ఏలూర్ రోడ్డు మీదుగా లింగవరం రోడ్డులోని కే కనె్వన్షన్‌కు 3.45 గంటలకు చేరుకుంటారు. అక్కడ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎడ్ల పందాలు, ముగ్గుల పోటీలు, హరిదాసు ప్రదర్శనలు, కోలాటం వంటి కార్యక్రమాలు తిలకిస్తారు. 4.50 గంటలకు బయలుదేరి 4.55 గంటలకు ఎన్టీఆర్ స్టేడియంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. హెలికాప్టర్‌లో బయలుదేరి 5.35 గంటలకు సీఎం జగన్ తన నివాసానికి చేరుకుంటారని మంత్రి కొడాలి నాని చెప్పారు.