కృష్ణ

అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలబడే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతిని జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ సెంటరులోని ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి మాజీ మంత్రి కొల్లు రవీంద్రతో పాటు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ ఉప సభాపతి, ముడా మాజీ చైర్మన్ బూరగడ్డ వేదవ్యాస్ తదితరులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించగా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రవీంద్ర మాట్లాడుతూ భారతదేశ చరిత్రలోనే సంక్షేమానికి శ్రీకారం చుట్టిన ఏకైక ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలను ఎన్టీఆర్ అమలు చేసి వారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారన్నారు. ఎన్టీఆర్ ఆశయాలే సాధన దిశగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకువెళుతున్నారన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు. దురదృష్టవశాత్తు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కుట్ర రాజకీయాల ఫలితంగా అధికారాన్ని కోల్పోవల్సి వచ్చిందన్నారు. ప్రజలను నమ్మించి మాయ చేసిన ప్రస్తుత వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా జెండా ఎగుర వేసేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందన్నారు. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించిన బడుగుల ఆశాజ్యోతి ఎన్టీఆర్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ ఉపసభాపతి బూరగడ్డ వేదవ్యాస్ మాట్లాడుతూ పార్టీని స్థాపించిన తొమ్మిది నెలలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసేందుకు సీఎం జగన్మోహనరెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు. ఎన్టీఆర్ ఆత్మ క్షోభకు గురయ్యే విధంగా పాలన సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొనకళ్ల బుల్లయ్య, మోటమర్రి బాబా ప్రసాద్, గొర్రిపాటి గోపిచంద్, కాగిత వెంకటేశ్వరరావు, చిలంకుర్తి తాతయ్య, ఇలియాస్ పాషా, పిప్పళ్ల కాంతారావు, బత్తిన దాస్, కొట్టె వెంకట్రావ్, మరకాని పరబ్రహ్మం, తలారి సోమశేఖర ప్రసాద్, పివి ఫణికుమార్, కరెడ్ల సుశీల, లంకిశెట్టి నీరజ తదితరులు పాల్గొన్నారు.

మార్చినాటికి అర్హులందరికీ ఇళ్ల స్థలాలు సిద్ధం
మైలవరం, జనవరి 18: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మార్చి 25 నాటికి జిల్లాలో అర్హత కలిగిన వారందరికీ ఇళ్ళ స్థలాలను సిద్ధం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. శనివారం ఆయన మైలవరం సమీపంలోని పూరగుట్ట స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ జిల్లాలో 2.60 లక్షల మంది ఇళ్ళ స్థలాలకు అర్హులుగా నిర్థారించినట్లు తెలిపారు. వీరికి నాలుగువేల ఎకరాలు అవసరమై ఉందని ఇందులో 2600 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి ఉందని, ఇంకా 14 ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. ఇందుకోసం ఇంకా ప్రభుత్వ భూమి ఎక్కడైనా ఉందా అని వెతుకుతున్నామని, లేకపోతే ప్రైవేటు భూమిని కొనుగోలు చేయటానికి వెనుకాడబోమన్నారు. ఇందులో నిరుపయోగంగా ఉన్న భూమినే చూస్తున్నామన్నారు. రాష్ట్రంలో నిరుపేదలందరికీ ఇళ్ళ స్థలాలు ఇవ్వాలనేది ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమన్నారు. భూమిని సేకరించటంతోపాటు లే అవుట్ వేసి ఇళ్ళ స్థలాలుగా విభజించి రోడ్లు, డ్రైన్లు, మంచినీటి సౌకర్యం వంటి వౌలిక వసతులు కల్పించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో తహశీల్దార్ రోహిణీ, ఎంపిడిఓ సుబ్బారావు, ఈఓపీఆర్టీ బాల వెంకటేశ్వరరావు, పంచాయితీ కార్యదర్శి రఫి, శానిటరీ ఇనస్పెక్టర్ ఉమామహేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.