కృష్ణ

అఖిల పక్షం ఆధ్వర్యంలో నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ: అఖిల పక్ష పార్టీలు ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ అవనిగడ్డ ప్రధాన రహదారిలోని గాంధీజీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు ఆదివారం వినతిపత్రాలు అందజేశారు. అమరావతి నుండే పరిపాలన చేపట్టే విధంగా సీఎం జగన్‌కు బుద్దిపుట్టేలా చేయాలని వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ వెంకటేశ్వరరావు, గాజుల మురళీకృష్ణ, రాంప్రసాద్, మండలి రామ్మోహనరావు, ఆది నారాయణరావు, రాఘవ, బీజెపీ నాయకులు టి వెంకటగిరి, భూపతి సుబ్రహ్మణ్యం, కాంగ్రెస్ నేత దిడ్ల వీరరాఘవులు, జనసేన నేత రాయపూడి వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌లకు వైకాపా వ్యతిరేకం
*మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం (కోనేరుసెంటరు), జనవరి 19: కేంద్రం తీసుకువచ్చిన ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌పీఆర్ 2019 బిల్లులకు వైకాపా ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి స్పష్టంగా ప్రకటన చేశారని, ఈ విషయంలో ముస్లింలకు తాము అండగా ఉంటామని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు. ఆదివారం నగర ముస్లిం ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీలు)లు ముస్లింలకు తీవ్ర ఆందోళనకు గురిచేసేలా ఉన్న నేపథ్యంలో ఈ రెండింటినీ పరిశీలించి అసెంబ్లీలో ఆ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశ పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జామియా మసీద్ అధ్యక్షుడు ఎండీ అంజాద్ పాషా, రాజుపేట మసీద్ అధ్యక్షుడు రహ్మాద్ పాషా, నగర వైకాపా అధ్యక్షుడు, మాజీ చైర్మన్ షేక్ సిలార్ దాదా, మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ అచ్చాబా, రఫీ, భాషా తదితరులు పాల్గొన్నారు.