కృష్ణ

మానవ శక్తి సమీకరణే.. మానవ లోక ఉద్ధరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ: భౌతిక, ఆధ్యాత్మిక సమన్వయంతో కూడిన మానవ శక్తి సమీకరణే మానవ లోక ఉద్ధరణ అని, ఇదే గురు విశ్వస్ఫూర్తి ప్రధాన ధ్యేయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిలో భౌతికం వేరు, ఆధ్యాత్మికం వేరనే నానుడి ఉందని, అయితే ఈ రెండింటి సమన్వయంతోనే మానవ జీవితం సాకారం అవుతుందని చెప్పారు. స్థానిక కెవిఆర్ కళాశాలలో స్ఫూర్తి కుటుంబ సభ్యుల సమావేశం ఆదివారం జరిగింది. నిర్వాహకులు ఆళ్ళ రాజేష్ స్వాగతం పలికారు. కెవిఆర్ కళాశాల ప్రిన్సిపాల్ మాగం వెంకటేశ్వరరావు, ఆంగ్ల భాషోపన్యాసకులు వాసుదేవరావు, గృహ నిర్మాణ శాఖ డిఇఇ వీరభద్రరావు జ్యోతి వెలిగించి సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మంచితనం ఏనాడూ మోసానికి గురి కాకూడదనేని గురుదేవుల ఉద్బోధ అని అన్నారు. మానసిక శక్తితో, నైతిక యుక్తితో, మానవత్వమే మతంగా మనిషి జీవితాన్ని కొనసాగించాలని సూచించారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్ వెంకటేశర్లు మాట్లాడుతూ మనిషి చేత, మనిషి వలన, మనషి కొరకు అనే భావనతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని చెప్పారు. ఇదే గురు విశ్వస్ఫూర్తి ఆకాంక్ష అని అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ మానసిక నియంత్రణ వల్ల సంతోషకరమైన జీవితాన్ని సాధించవచ్చని, దీనికి గురు బోధనలు ఎంతో ఉపయోగపడతాయని సూచించారు. ముఖ్యంగా నేటి సమాజంలో చాలామంది పలు రుగ్మతలతో బాధపడుతూ, జీవితాలను సార్థకం చేసుకోలేకపోతున్నారని, విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. విశ్వమానవ శ్రేయస్సే విశ్వస్ఫూర్తి ప్రధాన ధ్యేయమని చెప్పారు. ఎన్ స్రవంతి మనస్సు నియంత్రించుకునేందుకు గురుదేవులు అందించిన ఆసన, ప్రాణాయామ, ధ్యాన పద్ధతులను వివరించారు. భక్తులను ఆశీర్వదిస్తూ గురుదేవులు సమావేశానికి సందేశం పంపారు. స్ఫూర్తి కుటుంబ సభ్యులు వై దుర్గారావు, అల్వా సాయిప్రసాద్, సదాశివరావు, పవన్‌కుమార్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 800 మంది హాజరయ్యారు.
రాష్టస్థ్రాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం
జి.కొండూరు, జనవరి 19: మండల పరిధిలోని వెలగలేరులో రాష్టస్థ్రాయి అండర్ -19 బాలికల విభాగం అంతర్ జిల్లాల వాలీబాల్ పోటీలను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. వెలగలేరులోని చనమోలు పకీర్రాయుడు జిల్లా పరిషత్ హైస్కూల్లో ఈపోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే వసంత మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడానికి వైసిపి ప్రభుత్వం, సిఎం జగన్మోహనరెడ్డి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, చదువుతో పాటు క్రీడల్లో కూడా బాగా రాణించాలన్నారు. పోటీల నిర్వాహకులను అభినందించారు. ముందుగా క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు, పిఇటిలు, చనమోలు రామచంద్రరావు, హ్యాండ్‌బాల్ అసోసియేషన్ సెక్రటరీ పి.సత్యనారాయణరాజు, వైసిపి నాయకులు వేములకొండ రాంబాబు, కాజ బ్రహ్మయ్య, వేములకొండ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.