కృష్ణ

సమస్యలపై నేరుగా కలవండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్): దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని సమస్యల విషయమై ఎవరైనా నేరుగా తన కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేస్తే సంబంధిత సమస్యను తానే స్వయంగా పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. మంగళవారం తన కార్యాలయానికి వచ్చిన వివిధ వర్గాల ప్రజల నుండి మంత్రి పేర్ని నాని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. విస్తరాకుల, స్వీట్ బాక్స్ తయారీ వ్యాపారం నిమిత్తం సీఎఎఫ్ రుణం డ్వాక్రా గ్రూపులో రుణం తన భార్య పేరున మంజూరైందని సుల్తానగరంకు చెందిన గొర్రిపర్తి నరేష్ మంత్రి పేర్నికి వివరించారు. అయితే విలేజ్ ఆర్గనైజేషన్ తీర్మానం కోసం బుక్ కీపర్ ముడుపులు అడుగుతున్నట్టు మంత్రికి ఫిర్యాదు చేశారు. తనకు మంజూరైన రూ.3లక్షలు రుణంలో రూ.10వేలు ఇవ్వాలని అడుగుతున్నారని, విలేజ్ ఆర్గనైజేషన్ పరిధిలో 23 గ్రూపులు ఉన్నాయని, ఒకొక్క గ్రూపు వారు రూ.10వేలు చొప్పున ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారంటూ పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన మంత్రి పేర్ని నాని రుణంపై కమిషన్లు ఆశించడం తప్పని, దానిపై విచారణ చేస్తామని తెలిపారు. కోన గ్రామ మాజీ సర్పంచ్ పొలం ఎదురుగా రెండు గ్రామాలకు తాగునీరు సరఫరా చేసే మూడు బోరు పంపులు ఉన్నాయని, ఒక వ్యక్తి అనుమతి లేకుండా ప్రొక్లైన్‌తో కోన రొయ్యల చెరువులు తవ్వుతున్నారని, ఆ ఉప్పునీటి ఊట తాగునీటి మోరులో ప్రవేశిస్తుందని కోన గ్రామస్థులు మంత్రి పేర్నికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి పేర్ని తహశీల్దార్‌తో ఫోన్‌లో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

చెరుకుతోటలో కొండలు చిలువ కలకలం
చల్లపల్లి, జనవరి 21: మండల పరిధిలోని యార్లగడ్డ చెరుకు తోటలో మంగళవారం ఎనిమిది అడుగుల కొండ చిలువ స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. చెరుకు తోటలో పనికి వెళ్లిన కూలీలకు కొండ చిలువ తారసపడటంతో గ్రామస్థులు కలవరపడ్డారు. ఇటీవల వచ్చిన వరదలకు కొండ చిలువలు ఈ ప్రాంతానికి వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. నడకుదురుకు చెందిన ఓ వ్యక్తి సహకారంతో ఆ కొంత చిలువను గ్రామస్థులు హతమరిచారు.

గురుకుల పాఠశాలలో పేరెంట్స్ కమిటీ సమావేశం
మోపిదేవి, జనవరి 21: మండల కేంద్రం మోపిదేవి మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో మంగళవారం పేరెంట్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఎంజె ప్రభాకర్ మాట్లాడుతూ స్థానిక గురుకుల జూనియర్ కళాశాలకు ప్రహరీ గోడ లేదని, వసతులు చాలక ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్నారని, అందుకు గాను గురుకుల జూనియర్ కళాశాలకు ప్రహరీగోడ ఏర్పాటు వెంటనే నిర్మించాలని, ఆట స్థలం లేనందున కళాశాల పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఆట స్థలంగా కేటాయించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఏటీపీ కె వీర రవి, పీఇటీ సత్యనారాయణ, ఉపాధ్యాయులు ఎం రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు.