కృష్ణ

చరిత్రలో నిలచిపోయే పుష్కరాలివి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఆగస్టు 6: రాష్ట్ర చరిత్రలోనే కాక పుష్కర చరిత్రలోనే చిరస్థాయిగా నిలచిపోయే కృష్ణా పుష్కరాలలో ప్రజాప్రతినిధులు కూడా భాగస్వాములై పుష్కర భక్తుల సేవల్లో తరించడమే కాకుండా పుష్కర పనులపై నిరంతర పర్యవేక్షణ చేసి పుష్కరాలను విజయవంతానికి కృషి చేయాలని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని పిలుపునిచ్చారు. శనివారం ఉదయం కౌన్సిల్‌హాల్లో నగర కార్పొరేటర్ల తో నిర్వహించిన సమావేశంలో ఎంపి నాని మాట్లాడుతూ విజయవాడ నగరంలో గత 60 ఏళ్ళ క్రితం ప్రముఖ ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కెఎల్ రావు చేపట్టిన తరువాతే మళ్లీ ఇప్పుడు వేలాది కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ప్రస్తుతం చేపట్టే ప్రతి అభివృద్ధి పని కేవలం పుష్కరాలకే కాదని, రాజధాని నగరంగా గుర్తింపుపొందిన విజయవాడ నగరాన్ని అద్భుత నగరంగా తీర్చిదిద్ది దేశంలోనే ఉన్నత నగరంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంకల్పించినందునే నగరంలో ఆయా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. పుష్కరాలకు విచ్చేసే కోట్లాది మంది భక్తులకు సేవలందించేందుకు డివిజన్ కార్పొరేటర్లు పునరంకితం కావాలని, తొలుత తమ డివిజన్లలో జరుగుతున్న ప్రీ పుష్కర పనులలో ఎటువంటి లోపాలు లేకుండా పర్యవేక్షించి నగర ప్రజలకే కాకుండా పుష్కరాలకు విచ్చేసే యాత్రికులకు సైతం మంచి వసతులను అందుబాటులోకి తేవాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతోనే పుష్కర పనులు విజయవంతమవుతాయన్నారు. ప్రతిరోజూ డివిజన్ ఇన్‌చార్జ్ ఆఫీసర్లు, కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకొని పనులు చురుకుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ మాట్లాడుతూ పుష్కరాల నేపథ్యంలో నగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులన్నీ ముగిసాయని, కేవలం పిన్నమనేని క్లీనిక్ రోడ్డు, కెటి రోడ్లు మినహా మిగిలిన 53 రోడ్లన్నీ ముగిసాయన్నారు. నగరంలో ఉన్న 5 ప్రధాన ఘాట్ లను 22 హబ్‌లుగా విభజించి ప్రతిఘాట్‌లలో ఇతర కార్పొరేషన్ల నుంచి వచ్చిన ముఖ్య అధికారులను ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తున్నామన్నారు. డివిజన్లలో మెరుగైన పారిశుద్ద్య చర్యల కోసం మైక్రో ప్లాన్‌ను సిద్దం చేయడమైందన్నారు. డివిజన్ స్థాయిలో జరిగే ప్రతి పనినీ కార్పొరేటర్లు పర్యవేక్షించాలన్నారు. విఎంసి కమిషనర్ వీరపాండియన్ మాట్లాడుతూ 25వేల మంది పారిశుద్ద్య సిబ్బందిని ప్రత్యేకంగా నియమించడం జరిగిందని, పరిసరాల్లో ఎటువంటి అసౌకర్యం కలుగకుండా విస్తృత చర్యలు తీసుకొంటున్నామన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, సెంట్రల్ ఎమ్మెల్యే బొండ ఉమ, పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, నగర డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు, టిడిపి ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.