కృష్ణ

పెద్దల సభ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడిన టీడీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని మంటగలిపితే ప్రజల పక్షాన నిలబడిన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పెద్దల సభ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని బతికించిందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మా జీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు అ న్నారు. రాజధాని తరలింపు, సీఆర్‌డీఎ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి పం పుతూ శాసనమండలి తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ గురువారం స్థానిక ల క్ష్మీటాకీసు సెంటరులో భారత రా జ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, చింతగుంటపాలెంలో శాసనమండలి చైర్మన్ షరీఫ్ చిత్ర పటాల కు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ అసెంబ్లీలో మెజార్టీ ఉందన్న కారణంతో ప్రజాస్వామ్యాన్ని మంట గలిపే విధంగా పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఎ బిల్లులకు ప్ర భుత్వం ఆమోదింప చేసుకుందన్నారు. శాసనమండలి చైర్మన్ షరీఫ్ భారత రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ప్రకారం, తనకు న్న విచక్షణాధికారాలను ఉపయోగించి ఆ రెండు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపి ప్రజాస్వామ్యాన్ని బతికించారన్నారు. ఇప్పటికైనా అధికార పక్షం రాజ్యాంగ విరుద్ధమైన అంశాలను పక్కన పెట్టి ప్రజల అభిష్టం మేరకు పాలన సాగించాలన్నారు. కార్యక్రమం లో టీడీపీ రాష్ట్ర నాయకుడు, బీసీ నేత కొనకళ్ల జగన్నాథరావు (బుల్లయ్య), జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రిపాటి గోపిచంద్, మున్సిపల్ మా జీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మాజీ వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీవిశ్వనాథం (చంటి), టీడీపీ పట్టణ, మండల అధ్యక్షులు ఇలియాస్ పాషా, కుంచే దుర్గా ప్రసాద్, ఎఎంసీ మాజీ చైర్మన్లు గోపు సత్యనారాయణ, చిలంకుర్తి తాతయ్య, మాజీ కౌన్సిలర్లు కొట్టె వెంకట్రావ్, గనిపిశెట్టి గోపాల్, లోగిశెట్టి వెంకటస్వామి, టీడీపీ జిల్లా కార్యదర్శి పివి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు.