కృష్ణ

గ్రామస్వరాజ్యం దిశగా అడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: మహాత్మ గాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్యం దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోందని జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రం మచిలీపట్నం పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ నందు 71వ భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకావిష్కరణ చేసిన కలెక్టర్ ఇంతియాజ్ వందన సమర్పణ చేశారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబుతో కలిసి ప్రత్యేకంగా అలంకరించిన రథం ద్వారా పెరేడ్‌ను పరిశీలించారు. సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్య్ర సమరయోథుడు స్వర్గీయ తోట రామలింగేశ్వరావు సతీమణి వెంకట భారతమ్మ, ఆదర్శ రైతు, పద్మశ్రీ అవార్డు గ్రహీత గొరిపర్తి నరసింహరాజు యాదవ్‌లను కలెక్టర్ ఇంతియాజ్, జేసీ మాధవీలత, ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తదితరులు మర్యాదపూర్వకంగా పరామర్శించి సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కలెక్టర్ ప్రసంగం సాగింది. జిల్లా అభివృద్ధితోపాటు రెండు తెలుగు రాష్ట్రాలకు ఇతోదికంగా మారనున్న బందరు ఓడరేవు నిర్మాణం పట్ల ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఇప్పటికే ఓడరేవు నిర్మాణ డీపీఆర్‌ను సిద్ధం చేశామన్నారు. తొలి విడతగా రూ.4682 కోట్లతో పనులు ప్రారంభించనున్నట్టు తెలిపారు. జిల్లాలో 845 గ్రామ సచివాలయాలు, 286 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేయటంతో పాటు ప్రతి సచివాలయంలో 11 మంది సిబ్బందిని నియమించినట్టు తెలిపారు. గ్రామ సచివాలయాల్లో రూ.16కోట్లతో అవసరమైన అన్ని పాలనా అవసరాలను సమకూర్చినట్టు చెప్పారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు గాను నవశకం సర్వే నిర్వహించినట్టు తెలిపారు. ఈ సర్వే ద్వారా జిల్లాలో 12.59లక్షల మందిని అర్హులుగా గుర్తించగా తొలి విడతగా 4వేల 883 మందికి క్యూఆర్ కోడ్‌తో కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు అందించడం జరిగిందన్నారు. ఫిబ్రవరి నెలలో మిగిలిన వారందరికీ అందిస్తామన్నారు. ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల్లో ప్రధానమైన అందరికీ ఇళ్ల పథకం కింద ఉగాది నాటికి అర్హులందరికీ నివేశన స్థలాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 1.25లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 1.60లక్షలు కుటుంబాల వారు స్థలాలు లేని వారుగా గుర్తించామన్నారు. వీరికి నివేశన స్థలాలు ఇచ్చేందుకు ఉపాధి హామీ పథకం అనుసంధానంతో రూ.240కోట్లతో 855 లే అవుట్స్ ఏర్పాటు చేసి అన్ని వౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. వైఎస్‌ఆర్ గ్రామీణ, పట్టణ గృహ నిర్మాణాల పథకాల్లో వివిధ నిర్మాణ దశల్లో ఉన్న 15,240 గృహాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటి వరకు 19,522 గృహాలు పూర్తి చేశామన్నారు. రైతు భరోసా పథకం ద్వారా కింద గత సంవత్సరం రూ.13,500లు చొప్పున పెట్టుబడి సాయం అందజేశామన్నారు. వైఎస్‌ఆర్ భరోసా కేంద్రాల ద్వారా రైతు సేవలను మరింత విస్తృతం చేస్తున్నట్టు తెలిపారు. వైఎస్‌ఆర్ నేతన్న హస్తం కింద జిల్లాలో చేనేత మగ్గం కలిగిన 4278 మందికి రూ.24వేలు చొప్పున ఆర్థిక సాయం అందించామన్నారు. మత్స్య భరోసా పథకం కింద సముద్రంలో చేపల వేట నిషేధ కాలానికి గాను ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున జీవనభృతిగా ఆర్థిక సాయం అందించడం జరిగిందన్నారు. 17,336 మంది మత్స్యకారులు మత్స్య భరోసా కింద లబ్ధి పొందారని వివరించారు. సాగరమాల ఫేజ్-2 కింద రూ.252కోట్లతో మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ పనులు చేపట్టామన్నారు. ప్రకాశం బ్యారేజీ నుండి 2019 ఖరీఫ్‌లో ఇప్పటి వరకు సుమారు 147.36టీఎంసీల నీటిని సాగు, తాగునీటి అవసరాలకు విడుదల చేసినట్టు తెలిపారు. దీంతో జిల్లాలో 5 లక్షల ఎరకాల్లో వరి, 1.71లక్షల ఎకరాల్లో చేపలు, రొయ్యలు, ఇతర పంటలు సాగులోకి వచ్చాయన్నారు. వైఎస్‌ఆర్ కంటి వెలుగ కింద రెండు విడతలుగా 5లక్షల 65వేల మంది విద్యార్థులకు నేత్ర పరీక్షలు నిర్వహించామన్నారు. వీరిలో 4,500 మందికి శస్త్ర చికిత్సల అవసరాన్ని గుర్తించినట్టు తెలిపారు. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో నూతన మెనూను ప్రవేశ పెట్టి విద్యార్థులకు రుచికరమైన, పౌష్ఠికాహారం అందిస్తున్నట్టు తెలిపారు. జగనన్న విద్యాదీవెన కానుక కింద రానున్న విద్యా సంవత్సరం నుండి విద్యార్థులకు విద్యా కిట్‌లను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం బోధనను తీసుకు వచ్చిందన్నారు. దీని ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులు రానున్న రోజుల్లో కాంపిటేటీవ్ కోర్సుల్లో కూడా రాణించగలరన్నారు. నాడు-నేడు పథకం కింద ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. రూ.97కోట్లతో 490 పాఠశాలల్లో వౌలిక వసతులు కల్పించటంతో పాటు రూ.23కోట్లతో 300 పాఠాలల్లో ప్రహరీగోడల నిర్మాణం చేస్తున్నామన్నారు. ఇంటి ముందుకే ఇసుక విధానాన్ని ప్రయోగాత్మకంగా జిల్లాలో అమలు చేస్తున్నట్టు తెలిపారు. 72గంట్లోనే డోర్ డెలివరీకి చర్యలు తీసుకున్నామన్నారు. అక్రమ ఇసుక నిరోధానకి జిల్లాలో రూ.1.24కోట్లతో 54 ఇసుక చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మహిళలకు పూర్తి స్థాయి రక్షణ కల్పించేందుకు గాను దిశ చట్టాన్ని ప్రభుత్వం తీసుకు వచ్చిందన్నారు. ఈ చట్టం కింద మహిళలను వేధించినా, దాడులు చేసినా వారికి కఠిన శిక్షలు అమలవుతాయన్నారు. పౌర సేవలను కూడా ప్రభుత్వం విస్తృతం చేసిందన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు గాను తెల్ల కార్డు ఉన్న వారందరికీ నాణ్యమైన బియ్యాన్ని ఇళ్ల వద్దకే వలంటీర్ల ద్వారా సరఫరా చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లను అత్యంత పారదర్శకంగా కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతులే నేరుగా కొనుగోలు కేంద్రాల వచ్చి ప్రభుత్వం కల్పించిన గిట్టుబాటు ధర పొందేలా వారిలో చైతన్యం తీసుకు వచ్చామన్నారు. ఫలితంగా 44,432 మంది రైతుల నుండి 3లక్షల 63వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్‌ఆర్ పెన్షన్ కానుక, వైఎస్‌ఆర్ పెళ్లి కానుక, వైఎస్‌ఆర్ బీమా, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, వైఎస్‌ఆర్ వాహనమిత్ర తదితర పథకాలను పూర్తి స్థాయిలో పారదర్శకంగా అమలు చేస్తున్నట్టు కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు.