కృష్ణ

మెళుకువలతో చేపల సాగులో అధిక లాభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైకలూరు: కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యధికంగా చేపల, ఆక్వా చెరువులు విస్తారంగా పెరిగాయని వాటిని అధ్యయనం చేయడానికి మంగళవారం రాజస్థాన్ నుండి రైతాంగం కైకలూరు ప్రాంతంలో పరిశీలించారు. ముందుగా స్థానిక ఫిషరీష్ కార్యాలయంలో ఆక్వా ల్యాబ్‌ను పరిశీలించారు. సాంప్రదాయ పద్దతుల్లో పెరిగే చేపల పెంపకంపై కైకలూరు ప్రాంతానికి తరలి వచ్చామన్నారు. చేపల పెరుగుదలకు ఉష్ణోగ్రతలను బట్టి పెంపకంపై రైతులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కువగా ఈ ప్రాంతంలో ఫంగాస్, శీలావతి, కట్టా, రోహు, పండుగప్ప వంటి చేపల పెంపకం ఎక్కువగా కొనసాగిస్తారని, ఆక్వా సాగులో వనామీ, టైగర్ రొయ్య వంటి సాగు చేసుకోవచ్చని రైతుల నుండి, అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు. తీపి నీటితో పాటు ఉప్పు నీటిలో కూడా ఆక్వా పరిశ్రమ అభివృద్ధి సాధించిందని, ఆంధ్రప్రదేశ్‌లో తలసరి ఆదాయంలో మొదటి స్థానం కృష్ణా జిల్లా కలిదిండి, ద్వితీయ స్థానం కైకలూరని అందుకే ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఆక్వా, చేపల సాగుపై అవగాహన పెంపొందించుకుని మా ప్రాంతంలో కూడా చేపల పెంపకం చేపడతామని తెలిపారు. అనంతరం బాలేశ్వర్ ఫిష్ ప్యాకింగ్ సందర్శించి ప్యాకింగ్‌పై అవగాహన చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫిషరీష్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ రాజ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

‘కరెడ్ల’కు జాతీయ స్థాయి పురస్కారం
మచిలీపట్నం (కల్చరల్), జనవరి 28: స్థానిక చిలకలపూడి అన్నపూర్ణ వృద్ధాశ్రమం నిర్వాహకురాలు, జాతీయ స్థాయి సేవా పురస్కార గ్రహీత కరెడ్ల సుశీల సేవలు అభినందనీయమని పలువురు వక్తలు మంగళవారం కొనియాడారు. ఢిల్లీ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ నరేంద్ర గౌడ్, గణేష్, జస్టిస్ మధుసూదన్ చేతుల మీదుగా సుశీల జాతీయ స్థాయి పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ వృద్ధాశ్రమంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు వక్తలు ఆమె సేవానిరతిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు, భారతీయ సాహిత్య పరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు కారుమూరి రాజేంద్రప్రసాద్, ముదిగొండ శాస్ర్తీ తదితరులు పాల్గొన్నారు.

తమ ప్లాట్లు తీసుకోవద్దంటూ
ఇందిరమ్మ లే అవుట్ లబ్ధిదారుల ధర్నా
చల్లపల్లి, జనవరి 28: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పంపిణీ చేసిన నివేశన స్థలాలలో తమ పేదరికం కారణంగా ఇళ్లు నిర్మించుకోలేకపోయామని, ప్రస్తుత ప్రభుత్వ సహకారంతో ఇళ్లు నిర్మించుకుంటామని పేదలు తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని రామానగరం మాదిరెడ్డి వారి తోటలో పాత ఇందిరమ్మ లే అవుట్ లబ్ధిదారులు ధర్నా చేశారు. నివేశన స్థలాల పంపిణీకి రెండు లే అవుట్‌లలో 64 ప్లాట్‌లు ఖాళీగా ఉన్నట్లు తెలపడం సమంజసం కాదన్నారు. రెవెన్యూ అధికారులు నివేశన స్థలాల పంపిణీకి ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించాలని కోరారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు శిబిరం వద్దకు చేరుకుని గతంలో పంచిన స్థలాలను తిరిగి తీసుకోవడం జరగలేదని తెలిపిన అనంతరం ధర్నా విరమించారు.