కృష్ణ

రేపు సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ): ఇంద్రకీలాద్రిపై వెలసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 30న గురువారం అమ్మవారు సరస్వతిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీ వికారి నామ సంవత్సరం మాఘ శుద్ధ పంచమిని పురస్కరించుకుని గురువారం శ్రీపంచమి నాడు శ్రీ సరస్వతిగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ఇదేరోజు అమ్మవారి జన్మదినంగా ప్రాచుర్యంలో ఉంది. దీన్ని పురస్కరించుకొని అమ్మవారు జ్ఞానప్రదాయిని వాగ్దేవి అయిన సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారిని ఆరాధించటం వల్ల జ్ఞానసిద్ధి కలిగి చైతన్యవంతులు అవుతారని ప్రతీతి. అందుకే శ్రీపంచమి రోజు శ్రీ దుర్గాదేవి ప్రధాన ఉత్సవమూర్తిని సరస్వతీదేవిగా అలంకరించడంతో పాటు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు, విద్యార్థుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయంలోని మల్లిఖార్జున మండపం 6వ అంతస్తులో ఇందుకోసం ఏర్పాట్లు చేసిన అధికారులు అదేరోజు వేదపండితుల ఆధ్వర్యంలో సరస్వతి మంత్ర హవనం కూడా నిర్వహించనున్నారు. శ్రీపంచమి రోజు సరస్వతీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు పాఠశాల, కళాశాల విద్యార్థినీ, విద్యార్థులకు ఉచిత దర్శనభాగ్యాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ నెల 30న గురువారం ఉదయం 7నుండి సాయంత్రం 6గంటల వరకు విద్యార్థులకు ఉచిత దర్శన సదుపాయం కల్పించారు. విద్యార్థినీ, విద్యార్థులు కనకదుర్గానగర్ నుండి అర్జునవీధి ద్వారా మహామండపంలో ఉచిత క్యూలైన్ల ద్వారా ముఖ మండపం నుంచి అమ్మవారి దర్శనం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉచిత దర్శనం అయిన తరువాత విద్యార్థినీ, విద్యార్థులకు కలం, అమ్మవారి ఫొటో, అమ్మవారి రక్షాకంకణం, కుంకుమ ప్రసాదం ఇస్తారు. మహా మండపంలోని 6వ అంతస్తులో సరస్వతి అమ్మవారి సన్నిధిలో రక్షాకంకణ ధారణకూ అధికారులు ఏర్పాట్లు చేశారు.