కృష్ణ

నియంత కంటే దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు: సీఎం జగన్ ఆలోచనలు నియంత కంటే దారుణంగా ఉన్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. జి.కొండూరులో తెలుగు యువత జిల్లా కార్యదర్శి అంకెం సురేష్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అమరావతి పరిరక్షణ సమితి ఇచ్చిన పిలుపు మేరకు ర్యాలీని నిర్వహించారు. ఈసందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ శాసన మండలిలో వికేంద్రీకరణ బిల్లు పాస్ అవ్వలేదని మండలిని రద్దు చేసినట్లుగానే అక్రమాస్తుల కేసులో శిక్ష పడితే సిఎం జగన్ శాసనసభను కూడా రద్దు చేస్తారని ఎద్దేవా చేశారు. రాజధాని మార్పునకు ప్రజామోదం లేదన్నారు. 8నెలలుగా అభివృద్ధి కుంటుపడిందన్నారు. మయసభలో అవమాన పడిన దుర్యోధనుడు ఎంత ఆగ్రహంతో ఊగిపోయాడో, మండలిలో భంగపడిన జగన్ కూడా అదే ఆగ్రహంతో ఉన్నాడన్నారు. ఈకార్యక్రమంలో వుయ్యూరు నరసింహారావు, దాసరి హనుమంతరావు, అంకెం సురేష్, బెజవాడ గణపతి, అంకెం సురేష్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.

నేర, ప్రమాదాల నియంత్రణకు సీసీ కెమెరాలు
* ఎస్పీ రవీంద్రనాథ్ బాబు
నాగాయలంక, జనవరి 29: నేర నిరోధం, ప్రమాదాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. మండల కేంద్రం నాగాయలంకలో స్థానిక పోలీసు స్టేషన్ వద్ద ఇందుకు సంబంధించిన సీసీ కెమెరాల వ్యవస్థను, ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించిన పరికరాలను బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మారుతున్న వ్యవస్థకు అనుగుణంగా ప్రజలకు ప్రమాదాలు, నేరాల నియంత్రణ వంటి విషయాలపై అవగాహన కల్పించేందుకే పోలీసు శాఖ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఎక్కడ ఎప్పుడు ఏ విధమైన నేరాలు జరిగినా, ప్రమాదాలు చోటు చేసుకున్నా ఈ విధమైన పరికరాలు ద్వారా అప్పటికప్పుడే పోలీసు వారు తెలుసుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నూతన సాంకేతిక వ్యవస్థకు అనుగుణంగా ప్రజలు తమవంతు సహకారాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విజయ్ కుమార్ కోరారు. అవనిగడ్డ శాసనసభ్యుడు సింహాద్రి రమేష్‌బాబు మాట్లాడుతూ పోలీసు శాఖ నేతృత్వంలో ప్రమాదాలు, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ డీఎస్పీ ఎం రమేష్‌రెడ్డి, అవనిగడ్డ సీఐ బివి రవికుమార్, నాగాయలంక ఎస్‌ఐ చల్లా కృష్ణ, అవనిగడ్డ ఎస్‌ఐ సందీప్, కోడూరు ఎస్‌ఐ రమేష్, నాగాయలంక ఎఎస్‌ఐ బండారు కృష్ణమూర్తి, మహిళా మిత్ర సభ్యులు తదితరులు పాల్గొన్నారు.