కృష్ణ

భక్తులతో పోటెత్తిన సంగమం ఘాట్ ఎ, బి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం/మైలవరం, ఆగస్టు 15: కృష్ణాపుష్కరాల నాల్గవ రోజు ఇబ్రహీంపట్నంలోని సంగమం ఘాట్ భక్తులతో పోటెత్తింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సెలవుదినం కావటంతో ఉద్యోగులు, ప్రజలు వేలాదిగా తరలివచ్చి సంగమం ఘాట్‌లో పుష్కర స్నానం చేశారు. సోమవారం తెల్లవారుఝామునుండే భక్తులు తరలి రావటం విశేషం. తొలిదశలో వెలవెలబోయిన సంగమం ఘాట్ రాను, రాను భక్తులతో పుంజుకుంటోంది. దీంతో ప్రభుత్వ ఆశయం నెరవేరుతోంది. మరో వైపు సంగమం ఘాట్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా భక్తులను ఇటువైపునకు మళ్ళించాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. సుదూర ప్రాంతాలనుండి వచ్చే భక్తులు మాత్రమే సంగమం ఘాట్‌లో స్నానానికి మొగ్గు చూపుతున్నారు. నదుల అనుసంధానం తమ ఘనతేనని చెప్పుకుంటున్న ప్రభుత్వం రెండు నదులు కలిసే సంగమం ఘాట్ వద్దకు ప్రతిరోజూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రావటం, కృష్టమ్మకు హారతినిచ్చే కార్యక్రమంలో పాల్గొనటం, రోజుకొక అంశంపై ఇక్కడ చర్చాగోష్టి ఏర్పాటు చేసి ఇందులో పాల్గొన్న వారికి బహుమతులు అందించటం వంటి కార్యక్రమాలతోపాటు ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలను సైతం పెద్దయొత్తున ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఈఘాట్‌కు రానురాను భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఐతే సంగమం ఘాట్‌ను అధికారులు అత్యంత విశాలంగా ఏర్పాటు చేసి ఏ,బి,సి,డి,ఈ అనే నాలుగు భాగాలుగా విభజించారు. ఇందులో ఏ,బి విభాగాలు రెండు నదుల నీరు కలిసే చోటు కావటంతో భక్తులు అక్కడే స్నానం చేస్తున్నారు. ఇదే ఘాట్‌లోని మిగిలిన సి,డి,ఈ భాగాలలో స్నానం చేయటానికి ఎవరూ ముందుకు రావటం లేదు. ఈభాగాలున్న ఘాట్‌కు గోదావరి నది నీరు వస్తున్నందున ఆ నీరు ఎర్రగా బురదలుగా ఉండటంతో భక్తులు ఇటువైపు కనె్నత్తి చూడటం లేదు. దీంతో సంగమం ఘాట్‌లోని ఈభాగం భక్తులు లేక వెలవెలబోతోంది. ఈభాగంలో సైతం భక్తులచే స్నానం చేయించాలని భావిస్తున్న అధికార యంత్రాంగం సోమవారం ప్రత్యేకంగా ఒక డీఎస్పీ స్థాయి అధికారిని అక్కడే ఉంచి వచ్చే ఉచిత బస్సులతోపాటు ప్రతి వాహనాన్ని నిలుపుదల చేసి సంగమం ఘాట్ సి,డి,ఈ భాగాల వైపునకు భక్తులను మళ్ళిస్తున్నారు. ఐనప్పటికీ భక్తులు మాత్రం అక్కడి నుండి నడుచుకుంటూ సంగమం ఘాట్ ఏ,బి విభాగాలవైపునకు వెళ్ళి అక్కడే స్నానం చేస్తున్నారు. పోలీసుల ఆంక్షలను కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.