కృష్ణ

12వ రోజు వీరమ్మ తిరునాళ్లకు పోటెత్తిన భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉయ్యూరు: వీరమ్మతల్లి తిరునాళ్ళుకు 12వ రోజూ భక్తులు పోటెత్తారు. శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగిన శిడిబండి ఉత్సవం జరిగింది. తిరునాళ్ళు ముగింపు దశకు చేరుకోవడంతో భక్తులు అమ్మ వారిని దర్శించుకొని మొక్కుబడులు తీర్చుకునేందుకు బారులు తీరారు. తెల్లవారుఝాము నుండే ఆలయంలో క్యూలైన్‌లలో భక్తులు క్యూ కట్టారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూలైన్‌లను దాటి రోడ్డు పై తిరునాళ్ళ ప్రాంగణం చివరి వరకు నిలబడ్డారు. ఆలయం వెనుక ప్రత్యే కంగా ఏర్పాటు చేసిన ప్రాంతంలో పొంగళ్ళు వండుకుని, కుటుంబ సమేతంగా డప్పు వాయిద్యాలతో అమ్మవారిని దర్శించుకున్నారు. ఎటు వంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు పటిష్టమైన బందో బస్తు ఏర్పాట్లను చేసారు. సిసి కెమేరాల పర్యవేక్షణలో అణువణువు పరిశీలిస్తున్నారు. రోటరీక్లబ్ ఆఫ్ ఉయ్యూరు భక్తులకు కరోనా వైరస్ శోకకుండా హోమియో మందులు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కోటిరెడ్డి, జె.శ్యామలాదేవి తదితరులు పాల్గొన్నారు. వివిధ స్వచ్చంద సేవా సంస్ధలు భక్తులకు అల్పాహారం, మజ్జిగ, తాగు నీటిని అందించగా, నగర పంచాయతీ ప్రత్యేక పారిశుధ్య ఏర్పాట్లను చేసింది.