కృష్ణ

పెండింగ్ ఫైల్స్ అన్నింటినీ క్లియర్ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: జిల్లా పరిపాలనా కేంద్రమైన కలెక్టరేట్‌లో శనివారం కలెక్టర్ ఇంతియాజ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కలెక్టరేట్‌లోని అన్ని సెక్షన్లను సందర్శించిన ఆయన ఆయా సెక్షన్ల వారీగా పెండింగ్ ఫైల్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో ఏ ఒక్క ఫైల్ పెండింగ్ ఉండటానికి వీలు లేదన్నారు. ప్రతి ఫైల్‌ను అప్పటికప్పుడు క్లియర్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరేట్‌కు వివిధ పనులపై వచ్చే వారి వివరాలను ప్రత్యేక రిజిష్టర్‌లో విధిగా నమోదు చేయాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వద్దని, బాధ్యతాయుతమైన విధులు నిర్వర్తించి ప్రజలకు ప్రభుత్వ సేవలు అందేలా చూడాల్సిన బాధ్యత కలెక్టరేట్ ఉద్యోగులపై ఉందన్నారు. కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి ఎ ప్రసాద్, ఆర్డీవో ఎన్‌ఎస్‌కె ఖాజావలి, కలెక్టరేట్ ఎఓ వెనె్నల శ్రీనివాస్ ఉన్నారు.