కృష్ణ

జగన్ పాలనలో అర్హులందరికీ లబ్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పాలనలో అర్హులందరికీ లబ్ధి చేకూర్చడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. వైఎస్‌ఆర్ నవశకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన నూతన బియ్యం కార్డులను శనివారం మండల పరిధిలోని మేకావానిపాలెం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్‌తో కలిసి మంత్రి పేర్ని అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పేర్ని మాట్లాడుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి వాటిని అమలు చేస్తున్నట్టు తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో అత్యంత పారదర్శకత పాటిస్తున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా అర్హులందరికీ కొత్తగా బియ్యం కార్డులు పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. బియ్యం కార్డులు రాని వారు ఆందోళన చెందవల్సిన పని లేదన్నారు. రీ వెరిఫికేషన్ ద్వారా కార్డులు అందని వారికి కూడా మంజూరవుతాయన్నారు. కొంత మంది మహిళలు తమకు అమ్మఒడి పథకం కింద బ్యాంక్ నగదు జమ కాలేదని మంత్రికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆయన విచారించాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. నవీన్ మిట్టల్ కాలనీ, హమాలీ కాలనీల వాసులు మంత్రిని కలిసి వారి వారి సమస్యలను వివరించగా నవీన్ మిట్టల్ కాలనీలో పూర్తి స్థాయిలో డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభించామని, హమాలీ కాలనీలో రోడ్డు, డ్రైన్ నిర్మాణ పనులు జరుగుతున్నట్టు మంత్రి తెలిపారు. కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ జిల్లాలో 25వేల మంది గ్రామ/వార్డు వలంటీర్లను, 10వేల మంది సచివాలయ సిబ్బందిని నియమించినట్టు తెలిపారు. సచివాలయాల పనితీరు భేషుగ్గా ఉందన్నారు. ప్రజలు తమ సమస్యలను సచివాలయాల ద్వారానే పరిష్కరించుకుంటున్నారన్నారు. ఆర్డీవో ఖాజావలీ మాట్లాడుతూ ఒక్కో నియోజకవర్గంలో ఒకొకక్క గ్రామంలో బియ్యం కార్డుల పంపిణీ పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపట్టాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు మేకావానిపాలెం గ్రామంలో బియ్యం కార్డుల పంపిణీ చేపట్టామన్నారు. కొన్ని ప్రింటింగ్ అయిన కార్డులు వచ్చాయని, వాటిని మాత్రమే ఈ రోజు పంపిణీ చేస్తున్నామన్నారు. త్వరలో అందరికీ బియ్యం కార్డులు అందిస్తామన్నారు. బియ్యం కార్డులు రాని వారెవరైనా ఉంటే సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ జివి సూర్యనారాయణ, తహశీల్దార్ సునీల్ బాబు, ఎఎంసీ ఉపాధ్యక్షుడు తోట సత్యనారాయణ, మాజీ సర్పంచ్ మేకా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.