కృష్ణ

వివాదంలో డూండీ గణేష్ ఉత్సవ కమిటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 3: ఊహించినట్లే డూండి గణేష్ ఉత్సవ కమిటిని వివాదాలు చుట్టుముట్టాయి. ఘంటసాల ప్రభుత్వం సంగీత కళాశాల ఆవరణలో గత ఏడాది నుంచి వైభోవంగా నిర్వహిస్తూ వస్తున్న వినాయక చవితి వేడుకలు ఈసారి సందిగ్ధంలో పడ్డాయి. రాజకీయ రంగు పులుముకున్న ఉత్సవ నిర్వహక కమిటిపై ఆధిపత్య పోరుకు తెర లేచింది. ఈక్రమంలో ఉత్సవ కమిటీలో సభ్యునిగా ఉన్న పారిశ్రామికవేత్త కోగంటి సత్యం జైలుబాట పట్టాడు. ఎమ్మెల్యే బొండా ఉమ తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకే డూండి ఉత్సవ కమిటీలో తన వర్గాన్ని ఏర్పాటు చేసుకుని వివాదానికి తెరలేపి కోగంటి సత్యాన్ని ఇక్కడ అడుగుపెట్టకుండా చేసేందుకే అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయించాడంటూ సత్యం వర్గం ఆరోపిస్తోంది. అయితే ఉత్సవ కమిటి నిధులు కాజేసిన సత్యాన్ని నిలదీసినందుకు అనుచరులతో కలిసి తనపై హత్యాయత్నానికి పాల్పడ్డాంటూ కమిటీలోని మరో సభ్యుడు సత్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయడం మరోకోణం. ఏది ఏమైనా గత ఏడాది ఘనంగా వేడుకలు నిర్వహించిన డూండి ఉత్సవ కమిటి వివాదంలో చిక్కుకోవడం, కమిటీలో చీలికలు చోటు చేసుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో సత్యం జైలుకు వెళ్లడంతో.. ఇప్పుడు ఏ వర్గం మిగిలిన లాంఛనాలు పూర్తి చేసి చవితి వేడుకలు నిర్వహిస్తారంటూ భక్తుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో కోగంటి సత్యం అరెస్టుకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. ఘంటసాల ప్రభుత్వ సంగీత కళాశాల కేంద్రంగా డూండి గణేష్ ఉత్సవ కమిటి వెలిసింది. గత ఏడాది ఇక్కడ 63 అడుగుల ఎత్తు వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఉత్సవాలు ఘనంగా నిర్వహించింది. ఈ ఏడాది 72 అడుగుల ఎత్తు విగ్రహం ఏర్పాటు చేసి నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. కాగా మధ్యంతరంలోనే వివాదాలు తలెత్తాయి. కమిటీలోని భవానీపురానికి చెందిన పారేపల్లి రాకేష్ (29) సభ్యునిగా ఉన్నాడు. ఇదే కమిటిలో కోగంటి సత్యం కూడా సభ్యుడే. అయితే గత ఏడాది వేడుకల్లో 25లక్షల రూపాయలు స్వాహా చేశాడంటూ సత్యంపై ఆరోపణలు కొనసాగుతున్నాయి. వీటి సంగతి తేల్చితేనే.. ఈ ఏడాది వేడుకల్లో పాలుపంచుకోవాలని లేకుంటే కమిటి నుంచి తొలగిస్తామంటూ సత్యానికి హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి సంగీత కళాశాల ఆవరణలో చర్చలు ముగిసిన మీదట తాను హోండా యాక్టివాపై ఇంటికి వెళ్తుండగా.. కొత్త వంతెన సెంటర్ వద్ద కారులో వచ్చిన కోగంటి సత్యం అతని అనుచరులు సూరిబాబు, తిరుపతి సురేష్‌లు తనపై దాడి చేసి వైరుతో చంపే ప్రయత్నం చేశారని, కేకలు పెట్టగా చుట్టుపక్కల వారు వచ్చేసరికి తన యాక్టీవా తీసుకుని కారులో పరారయ్యారంటూ కమిటి సభ్యుడు పారేపల్లి రాకేష్ సూర్యారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కోగంటి సత్యం, సూరిబాబు, సురేష్‌లపై క్రైం నెంబర్ 220/16, సెక్షన్ 409, 307, 506, 384 ఐపిసి రెడ్‌విత్ 34కింద కేసులు నమోదు చేశారు. కోగంటి సత్యాన్ని శనివారం ఉదయం అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకువచ్చారు. దీంతో స్టేషన్ వద్ద అతని అనుచరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో అతన్ని పోలీసులు పాయకాపురం పోలీస్టేషన్‌కు తరలించి సాయంత్రం మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ఈనెల 16 వరకు రిమాండు విధించారు. దీంతో పోలీసులు అతన్ని గన్నవరం సబ్‌జైలుకు తరలించారు. కాగా ఇదే కేసులో నిందితులపై సూరిబాబు, సురేష్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రెరా బిల్లును సరళీకృతం చేయాలి
* క్రెడాయ్ సూచన
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, సెప్టెంబర్ 3: నిర్మాణ రంగంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అధారిటీ బిల్లు (రెరా)ను సరళీకృతం చేయాలని కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) ప్రభుత్వానికి సూచించింది. క్రెడాయ్ ఎపి అండ్ విజయవాడ చాప్టర్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం హోటల్ గేట్‌వేలో రెరా బిల్లుపై బిల్డర్లు, ఇంజనీర్లు, సిఎ, న్యాయవాదులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ప్రధానంగా ఈ బిల్లును నవ్యాంధ్రలో ప్రవేశపెట్టే విధంగా చర్యలు చేపట్టాలని నిపుణులు సూచించారు. ఈ సదస్సులో ప్రముఖ నిర్మాణ రంగ న్యాయ నిపుణులు ఎ.దుర్గాప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని బిల్లులో పాటించవలసిన ఖచ్చితమైన నిబంధనలు, నిర్మాణ రంగంపై ప్రభావితం చేసే అంశాలు, అదే విధంగా వాటిని ఏ విధంగా అనుకూలంగా అన్వయించుకోవాలో తదితర అంశాలపై చర్చించిన పిదప బిల్డర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. క్రెడాయ్ ఎపి అధ్యక్షుడు ఎ.శివారెడ్డి మాట్లాడుతూ సమాజానికి, నిర్మాణదారులకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అధారిటీ బిల్లుపై అవగాహన కల్పించి, నిర్మాణ రంగంలో సమస్యలు తలెత్తకుండేందుకు అవగాహన సదస్సు నిర్వహించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ విజయవాడ చాప్టర్ ప్రధాన కార్యదర్శి పి.విజయరామరాజు, సిటి ప్లానర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

‘పుష్కర సేవక్’ల అంకితభావం వెలకట్టలేనిది: సీపి సవాంగ్
విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 3: పనె్నండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాల్లో విశేష సేవలు కనపరిచిన ‘పుష్కర సేవక్’ల అంకిత భావం వెలకట్టలేనిదని నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ అన్నారు. పుష్కర సేవక్‌ల పేరుతో నగరంలోని పలు విద్యాసంస్థల విద్యార్థులు స్వచ్చందంగా ముందుకు వచ్చి 12రోజుల పాటు కృష్ణా పుష్కరాల్లో సేవలందించడం అభినందనీయమన్నారు. వీరి సేవలను ముందుముందు కూడా సామాజిక కార్యక్రమాల్లో వినియోగించుకోవాల్సిన అవసరముందన్నారు. ముఖ్యంగా కమ్యూనిటీ పోలీసింగ్‌లో ‘పుష్కర సేవక్’ల భాగస్వామ్యం సత్ఫలితాలనిస్తుందన్నారు. కృష్ణా పుష్కరాల్లో స్వచ్చంద సేవలు అందించిన ‘పుష్కర సేవక్’లకు గౌరవ పురస్కారాలు అందచేశారు. ఎనికేపాడులోని 24కె ఫంక్షన్ హాలులో శనివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి సీపి ముఖ్య అతిథిగా హాజరుకాగా.. పుష్కరాల్లో సేవలందించిన విద్యార్థులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత మదర్ థెరిస్సా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా సీపి మాట్లాడుతూ పుష్కరాల్లో స్వచ్చంద సేవలు అందించేందుకు పిలుపునివ్వడంతో నగరంలోని యువత, విద్యార్థులు దీటుగా స్పందించి సుమారు ఏడు వేల మంది ముందుకు రావడం అభినందనీయమన్నారు. తొలుత ఎనిమిది గంటల పాటు మూడు షిఫ్టుల్లో పని చేయాలని సూచించగా.. నాలుగు గంటలకు మాత్రమే అంగీకరించిన పుష్కర సేవక్‌లు విధుల్లో నిమగ్నమయ్యాక ఏకధాటిగా మూడు షిఫ్టుల్లో పని చేయడం వారి అంకితభావానికి నిదర్శనమన్నారు. వీరిని కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగస్వామ్యం చేస్తామని, తద్వారా సత్ఫలితాలు రాబట్టనున్నట్లు సీపి చెప్పారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పుష్కర సేవక్‌ల స్ఫూర్తితో యువత నవ్యాంధ్ర నిర్మాణ దిశగా అడుగులు వేయాలన్నారు. అనంతరం వీరందరికీ సర్ట్ఫికెట్‌లు ప్రదానం చేశారు. విద్యార్థులను పంపిన విద్యాసంస్థలకు మెమోంటోలు అందచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి చెన్నుపాటి విద్య, వక్త ఎంసి దాస్, జాయింట్ పోలీసు కమిషనర్ పి హరికుమార్, డిసిపి జి పాలరాజు, ఇతర పుర ప్రముఖులు పాల్గొన్నారు.