కృష్ణ

ఐటీ దాడులతో చంద్రబాబుకు సంబంధం ఏమిటి..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: అధికార పక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల తీరు గురువింద గింజ సామెత చందాన ఉందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రవీంద్ర మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా జరిగిన ఐటీ దాడులకు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు ఏ ఒక్క ఆరోపణ లేకుండా నిబద్ధతతో ప్రజలకు సేవలందించారన్నారు. అటువంటి మచ్చలేని నాయకుడిపై గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన సతీమణి విజయలక్ష్మి దాదాపు 26 సార్లు కేసులు పెట్టినా ఏ ఒక్క కేసు నిరూపితం కాలేదన్నారు. తొమ్మిది నెలల పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఐటీ దాడులను తనకు అనుకూలంగా మలుచుకుని చంద్రబాబుపై లేనిపోని అవినీతి ఆరోపణలు చేయించడం సిగ్గు చేటన్నారు. తొమ్మిది నెలల క్రితం రిలీవ్ అయిన చంద్రబాబు నాయుడు పీఎస్ శ్రీనివాస్ రూ.2వేల కోట్లు అవినీతి చేశాడని, అదంతా చంద్రబాబు అవినీతేనని ప్రజలను నమ్మించేందుకు గత రెండు మూడు రోజులుగా మంత్రులు, వైసీపీ పేటీయం బ్యాచ్ జోడీ ఈగల మాదిరి రొధన చేస్తున్నారని విమర్శించారు. అసలు అవినీతిపై మాట్లాడే అర్హత వైఎస్‌ఆర్ సీపీకి నేతలకు ఎక్కడ నుండి వచ్చిందన్నారు. 11 కేసుల్లో మీ నాయకుడు వైఎస్ జగన్ ప్రధాన నిందితుడు కాదా, రూ.48వేల కోట్ల ఇడీ కేసులు, అటాచ్‌మెంట్లు నిజం కాదా అని ప్రశ్నించారు. రివర్స్ టెండర్లు ద్వారా మీరు కట్టబెట్టిన పోలవరం కాంట్రాక్టర్, ఇతర కాంట్రాక్టర్ల మీద ఐటీ దాడులు జరగలేదా..? దానికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కేవలం చంద్రబాబు కుటుంబంపై బురద జల్లాలనే ప్రయత్నమే తప్ప మరొకటి లేదన్నారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిపోయింది, 4వేల 600 ఎకరాల భూములు తెలుగుదేశం పార్టీ నేతలు దోచేసుకున్నారని మాట్లాడిన మంత్రులు తొమ్మిది నెలల్లో ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. తప్పు జరిగితే చర్యలు ఉండేవన్నారు. తప్పు లేదు కాబట్టే చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. రోజు రోజుకీ ప్రభుత్వం అవినీతి కుంభకోణాల్లో చిక్కుకుపోతుందని ఆరోపించారు. రెడ్డొచ్చి మొదలాయే అన్న చందంగా బందరు ఓడరేవు పరిస్థితి తయారైందన్నారు. గతంలో నవయుగ సంస్థ పోర్టు నిర్మాణానికి శాయిల్ టెస్ట్‌లు చేసి పనులు ప్రారంభిస్తే అటువంటి నవయుగ సంస్థను పక్కన పెట్టారన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులతో పోలవరం నిర్మించలేని ప్రభుత్వం నేడు బందరు పోర్టును ఏ విధంగా కడుతుందన్నారు. ఓడరేవు నిర్మాణ విషయంలో నిర్ధిష్ఠమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోర్టు కోసం మళ్లీ ఉద్యమించక తప్పదన్నారు. స్థానిక మంత్రి పేర్ని నాని చంద్రబాబుపై రాబందుల సామెత చెప్పడం సిగ్గు చేటన్నారు. గతంలో ఎమ్మెల్యేగా పేర్ని నాని, వారి అనుయాయులు చేసిందేమిటో ప్రజలందరికీ తెలుసన్నారు. పంపుల చెరువులో చేపలు అమ్ముకుని, ప్రభుత్వ భూములు, ఫ్లాట్‌లు వేస్తే అక్రమంగా అమ్ముకున్నది మీరు కాదా అని ప్రశ్నించారు. మంత్రిగా తొమ్మిది నెలల్లో బందరు అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు గానీ డ్రైనేజీ నిర్మాణ నిమిత్తం మేం తీసుకు వచ్చిన 14వ ఆర్థిక సంఘం నిధులను రోడ్ల నిర్మాణానికి మళ్లించి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేయడం సిగ్గు చేటన్నారు. కాంట్రాక్టర్లందరినీ రింగ్ చేయించి అధిక శాతం లెస్‌తో ఎటువంటి వర్క్ ఆర్డర్లు లేకుండా వారి అనుయాయులకు పెద్ద ఎత్తున పనులు అప్పగించారని ఆరోపించారు. అధికార పక్షానికి తొత్తుగా వ్యవహరించే అధికారులపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని మాజీ మంత్రి రవీంద్ర హెచ్చరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీవిశ్వనాథం (చంటి), టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఇలియాస్ పాషా, పార్టీ నాయకులు మరకాని పరబ్రహ్మం, అబ్దుల్ అజీమ్, కోస్తా మురళీ, అంగర తులసీదాస్ తదితరులు పాల్గొన్నారు.