కృష్ణ

‘బ్లూ కోల్ట్స్’తో ప్రజలకు మరింత రక్షణ :ఎస్పీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: బ్లూ కోల్ట్స్ బృందాలతో ప్రజలకు మరింత రక్షణ కల్పించనున్నట్టు పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు అన్నారు. జిల్లా వ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటుతో నిఘా వ్యవస్థను పటిష్టపర్చామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 50 బ్లూ కోల్ట్స్ బృందాలను సోమవారం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దిశ వంటి సంఘటనలు ఎక్కడా పునరావృతం కాకుండా జిల్లాలో ఏ మహిళపై అయినా ఆకతాయిలు అల్లరిపాలు చేయాలని చూసినా వెను వెంటనే సమాచారం అందుకుని నిమిషాల వ్యవధిలోనే సంఘటనా ప్రాంతానికి చేరుకుని ఆకతాయిల ఆటకట్టించేలా నూతన సాంకేతిక విధానాన్ని జోడిస్తూ బ్లూ కోల్ట్స్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందాల ద్వారా జిల్లా వ్యాప్తంగా 24 గంటలూ పెట్రోలింగ్ వ్యవస్థను మెరుగుపర్చినట్టు తెలిపారు. బృందంలో ఉన్న సిబ్బంది ప్రత్యేకమైన ఏకరూప దుస్తులు ధరించి వీరు ఉపయోగించే వాహనాలకు జీపీఎస్ అమర్చబడి ఉంటుందన్నారు. దీని ద్వారా వీరు ఏ సమయంలో ఎక్కడ ఉన్నది, ఏ ఏ విధులు నిర్వహిస్తున్నది, ఏ మార్గంలో ప్రయాణిస్తున్నది, వారి పూర్తి వివరాలు పోలీసు కంట్రోల్ రూంకు తెలుస్తాయన్నారు. దొంగతనం, దోపిడి, చైన్ స్నాచింగ్, ర్యాగింగ్, రహదారి ప్రమాదాలు, అల్లర్లు, కొట్లాటలు వంటివి సంభవించినప్పుడు వీరు ఆయా ప్రదేశాలకు వెనువెంటనే వెళ్లి అక్కడ సమాచారాన్ని కంట్రోల్ రూంకు అందజేయటంతో పాటు అక్కడి పరిస్థితులను పూర్తిగా అదుపులోకి తీసుకుంటారన్నారు. బ్లూ కోల్ట్స్ ద్వారా నేర నియంత్రణ, నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు, ట్రైనీ ఐపీఎస్ కృష్ణకాంత్ పటేల్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ధర్మేంద్ర, బందరు డీఎస్పీ మొహబూబ్ బాషా, ఎఆర్ డీఎస్పీ సత్యనారాయణ, ట్రైనీ డీఎస్పీ శ్రావణి, సీఐలు చంద్రశేఖర్, వెంకట నారాయణ, శ్రీనివాసరావు, పరమేశ్వర్, కొండయ్య, ఆర్‌ఐలు చంద్రశేఖర్, వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు.