కృష్ణ

స్పందించే అధికారులేనప్పుడు చావడమే నయం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: స్పందించే అధికారులు లేనప్పుడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘స్పందన’లో ఆ అధికారుల ముందే చావడం మేలు అనుకున్న ఓ అర్జీదారుడు ఆత్మహత్యాయత్నం పాల్పడిన ఘటన సోమవారం కృష్ణాజిల్లా కలెక్టరేట్‌లో కలకలం సృష్టించింది. జాతీయ రహదారి విస్తరణలో తాను నష్టపోయిన భూమికి వచ్చిన పరిహారంతో కొనుగోలు చేసిన 72 గజాల స్థలాన్ని పాముల కొండయ్య కబ్జా చేయటంతో పాటు తన భార్యను బలత్కారం చేశాడని ఆరోపిస్తూ మొవ్వ మండలం పాలంకిపాడు గ్రామానికి చెందిన మరీదు వెంకటేశ్వరరావు తన భార్య రాధతో కలిసివచ్చి కలెక్టరేట్‌లో జరుగుతున్న స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా. కె మాధవీలత సాక్షిగా ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్పందన కార్యక్రమానికి వచ్చీ రాగానే ఈ అధికారుల వల్ల తనకు ఎటువంటి న్యాయం జరగదంటూ తనతో పాటు తెచ్చుకున్న పురుగుల మందును తాగాడు. దీంతో ఖంగుతిన్న అధికారులు హుటాహుటిన పోలీసుల సాయంతో వెంకటేశ్వరరావు చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకటేశ్వరరావుకు ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పటంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై తక్షణమే స్పందించిన కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు అర్జీదారుడి సమస్యపై పూర్తి స్థాయి విచారణకు మొవ్వ తహశీల్దార్, కూచిపూడి ఎస్‌ఐలను ఆదేశించామని బందరు ఆర్డీవో ఖాజావలీ విలేఖర్లకు తెలియజేశారు. ఆత్మహత్యాయత్నం పాల్పడటం నేరం కావటంతో సంబంధిత అర్జీదారుడు వెంకటేశ్వరరావుపై చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు.