కృష్ణ

ఐనపూరు ఘాట్ మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పమిడిముక్కల: మండల పరిధిలోని ఐనపూరు వద్ద కృష్ణానది పాయ వద్ద పుణ్య స్నానాల ఘాట్‌ను మూసి వేసినట్టు తహశీల్దార్ రత్నకుమారి తెలిపారు. మంగళవారం జరిగిన మహాశివరాత్రి ఏర్పాట్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కృష్ణానదికి వచ్చిన వరదల కారణంగా ఘాట్ వద్ద ఉన్న ప్రాంతం రెండు మీటర్ల లోతు గుంత ఏర్పడటం వల్ల స్నానాలకు అనుకూలంగా లేని కారణంగా ఘాట్‌ను మూసి వేస్తున్నట్టు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో ఎంపీడీవో నాంచారరావు, ఆర్‌ఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మండలానికి చేరిన బ్యాలెట్ బాక్స్‌లు
కూచిపూడి, ఫిబ్రవరి 18: స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలన్న న్యాయస్థానం ఉత్తర్వులు మేరకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మొవ్వ మండలానికి మంగళవారం బ్యాలెట్ బాక్స్‌లు తరలి వచ్చాయి. మండలంలోని 21 గ్రామ పంచాయతీలలో ఎన్నికల నిర్వహణకు 53 పోలింగ్ కేంద్రాలను ప్రభుత్వం సిద్ధం చేసినట్లు ఎంపీడీఓ వి ఆనందరావు, ఇఓపీఆర్‌డీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. మండలంలో 172 బ్యాలెట్ బాక్సులు అవసరం కాగా పెద్దవి 102 వచ్చాయని, మిగిలినవి త్వరలో వస్తాయని ఆయన తెలిపారు. ఇప్పటికే ఎన్నికల మెటీరియల్ ఎన్నికల సంఘం అందజేసిందని ఆయన తెలిపారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

మంత్రి పదవి కోసమే పవన్‌పై జోగి విమర్శలు
* బందరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బండి రామకృష్ణ
మచిలీపట్నం(కోనేరుసెంటర్), ఫిబ్రవరి 18: మంత్రి పదవి వస్తుందనే ఆశతోనే పెడన నియోజకవర్గ శాసనసభ్యుడు జోగి రమేష్ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆ పార్టీ బందరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బండి రామకృష్ణ విమర్శించారు. మంగళవారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ బాధ్యతాయుతమైన పదవిలో కొనసాగుతున్న జోగి రమేష్ ఏ మాత్రం సంస్కారం లేకుండా పవన్ కల్యాణ్‌ని విమర్శించడం గర్హనీయమన్నారు. అధికార ప్రతినిధి లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ 18 కేసుల్లో నిందితుడైన పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌కు పవన్ కల్యాణ్‌ను విమర్శించే అర్హత ఏ మాత్రం లేదన్నారు. ఈ సమావేశంలో పట్టణ, మండల అధ్యక్షులు గడ్డం రాజు, తిమోతి, ఎస్సీ సెల్ నాయకుడు వంపుగడల చౌదరి, పినిశెట్టి కుమారి, గణేష్, వంశీ, మైఖేల్, పవన్, మహ్మద్, సులేమాన్, జగ్గయ్య, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.