కృష్ణ

తలో పని పంచి పెట్టడం టెండ‘రింగ్’ కాదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: మచిలీపట్నం నగర పాలక సంస్థలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన టెండర్లలో అవినీతిపై ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పకుండా డొంక తిరుగుడు మాటలు, పిట్టకథలతో తమ తాతల కాలం నుండి బందరుకు వనె్న తెచ్చేలా వ్యాపారులు సాగిస్తూ ప్రజల్లో ఓ ఇమేజ్ కలిగిన తన కుటుంబంపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని మాజీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)పై మండిపడ్డారు. మంత్రిగా తాను తీసుకు వచ్చిన 14వ ఆర్థిక సంఘం నిధులు, ప్రస్తుత ప్రభుత్వంలో మంజూరైన నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని తాను చేసిన ఆరోపణలకు సరైన సమాధానం చెప్పలేని పేర్ని నాని తనపై, తన కుటుంబంపై చేసిన ఆరోపణలకు గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రవీంద్ర ఘాటుగా బదులిచ్చారు. సంతోషంగా ఇస్తే గిఫ్ట్‌లు తీసుకోవచ్చని లంచాలకే పరమార్ధం చెప్పిన పేర్ని నాని తనపై, తన కుటుంబంపై లేనిపోని కట్టుకథలు అల్లి విమర్శలు చేయడం తగదన్నారు. రూ.25కోట్లతో పిలిచిన 125 పనులకు సంబంధించి సాక్షాత్తు మంత్రి పేర్ని నానినే కాంట్రాక్టర్లందరికీ పనులు కల్పించామని చెప్పడం సంబంధిత పనులను తలోకరికి పంచి రింగ్ టెండర్లకు పాల్పడటం కాదా అని ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పకుండా పొంతన లేని విమర్శలకు దిగడం తన దిగజారుడుతనాన్ని తెలియజేస్తుందన్నారు. బాధ్యతాయుతమైన మంత్రిగా ఉంటూ తాము చేసిన అవినీతి ఆరోపణలపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తమ హయాంలో రూ.5కోట్లతో డ్రైన్‌ల నిర్మాణానికి టెండర్లు పిలువగా ఆ సమయంలో జీఎస్టీ సమస్య వల్ల టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లే కోర్టుకు వెళ్లి ప్రత్యేక ఆర్డర్ ద్వారా ఆ పనులను రద్దు చేయించుకున్నారన్నారు. ఇందుకు సంబంధించి కాంట్రాక్టర్లు చెల్లించిన డిపాజిట్ మొత్తం కూడా ఇప్పటికీ మున్సిపల్ అధికారుల వద్దే ఉన్నాయన్నారు. ఇప్పుడు కాంట్రాక్టర్లందరికీ పనులను పంచేసి అంచనా మొత్తాలకే టెండర్లను అప్పగించి పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. తమ హయాంలో టెండర్లు అత్యంత పారదర్శకంగా జరిగాయని, ఒకొక్క పనికి ముగ్గురు నుండి పది మంది వరకు పోటీ పడి 15 నుండి 20 శాతం వరకు లెస్‌కు టెండర్లు వేసి పనులు దక్కించుకున్నారన్నారు. నేడు ఆ పరిస్థితి లేదన్నారు. ఈ నెల 13వతేదీన 50 వర్క్‌లకు టెండర్లు పిలువగా 13వతేదీన తెరిచి 17వతేదీన సంబంధిత కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్ చేయించుకున్నారన్నారు. వాస్తవ పరిస్థితులు చూస్తే టెండర్లు పిలువక ముందు ఈ నెల 10వతేదీ నాటికే చాలా చోట్ల పనులను పూర్తి చేశారన్నారు. ఏ వర్క్ ఏ కాంట్రాక్టర్‌కు వస్తుందో తెలియకుండా పనులు ఎలా పూర్తవుతాయని ప్రశ్నించారు. ఓ బ్రేక్ ఇన్‌స్పెక్టర్ బదిలీ విషయంలో రూ.50లక్షలు లంచం తీసుకున్నది మీరు కాదా, దీనిపై మీ ముఖ్యమంత్రి జగన్ వద్ద పంచాయతీ జరిగింది వాస్తవం కాదా అన్నారు. బినామీల గురించి మాట్లాడే అర్హత పేర్నికి లేదన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ముఖ్య అనుచరుడితో లారీలు కొనుగోలు చేయించి భారత్ సాల్ట్స్ నుండి వెళ్లేటప్పుడు ఉప్పు, అక్కడి నుండి వచ్చేటప్పుడు ఇసుక తీసుకు వస్తూ ఇసుక దందా చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నిరుపేదల కోసం జీ ప్లస్ 3 కింద 6,400 గృహాలు నిర్మిస్తే నేడు వాటిని ప్రారంభించలేని దుస్థితిలో మీరు ఉన్నారన్నారు. మా హయాంలో మంజూరు చేయించిన పనులన్నింటినీ పూర్తి చేసే సత్తా లేక వాటిని రద్దు చేసింది మీరు కాదా అని మాజీ మంత్రి రవీంద్ర మంత్రి పేర్ని నానికి ప్రశ్నలు సంధించారు.

ఐనపూరు స్నానాల రేవులో స్నానాలకు అనుమతించేది లేదు
* తహశీల్దార్ పద్మకుమారి స్పష్టీకరణ
పమిడిముక్కల, ఫిబ్రవరి 20: మండల పరిధిలోని ఐనపూరు వద్ద కృష్ణానది పాయలో మహా శివరాత్రి పుణ్య స్నానాలకు ఏర్పాట్లు చేయాలంటూ గ్రామస్థులు కోరిన మీదట తహశీల్దార్, సిబ్బంది ఐనపూరు గ్రామం వెళ్లి ఘాట్‌ను పరిశీలించగా పుణ్య స్నానాలకు అనువుగా లేదని, ఎట్టి పరిస్థితుల్లో స్నానాలకు యోగ్యంగా లేదని తహశీల్దార్ పద్మకుమారి తెలిపారు. ఎవరైనా స్నానా లు పుణ్య స్నానాలు ఆచరిస్తే రెవె న్యూ సిబ్బంది ఊరుకోరని ఆమె తె లిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నాంచారరావు, ఎస్‌ఐ సత్యనారాయ ణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.