కృష్ణ

ప్రజా సాధికార సర్వేను వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం(కోనేరుసెంటర్), సెప్టెంబర్ 3: ప్రజా సాధికార సర్వేను వేగవంతం చేయాలని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. మండల తహశీల్దార్ కార్యాలయాన్ని శనివారం సందర్శించిన ఆయన మండలంలో జరుగుతున్న సర్వే వివరాలను తహశీల్దార్ బి నారదమునిని అడిగి తెలుసుకున్నారు. ప్రజా సాధికార సర్వే ద్వారా అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. మంత్రి రవీంద్ర వెంట ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటిసి లంకే నారాయణప్రసాద్, ఎఎంసి చైర్మన్ గోపు సత్యనారాయణ, తదితరులు ఉన్నారు.

రాంకో సంస్థకు అత్యున్నత పురస్కారం
జగ్గయ్యపేట రూరల్, సెప్టెంబరు 3; గత 30 ఏళ్లుగా క్వాలిటీ సర్కిల్స్‌పై కార్మికులకు అవగాహన కల్పిస్తూ వాటిలో పోటీలు నిర్వహిస్తూ క్వాలిటీ సర్కిల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా- హైదరాబాదు వారు నిర్వహించిన 30వ చాప్టర్ క్యాప్షనులో రాంకో సిమెంట్ సంస్థ 2 అత్యున్నత పురస్కారాలు అందుకుందని సంస్థ అధ్యక్షుడు పిబి గోపాలకృష్ణ తెలిపారు. సంస్థలో ఉత్పత్తి, నాణ్యత పెంపొందించడానికి సమస్యలను అధిగమించడానికి ఉద్యోగులు 35 బృందాలుగా ఏర్పడి నాణ్యతాప్రమాణాలు పెంపొందించడానికి కృషి చేస్తున్నారని, వారి కృషిని రాంకో యాజమాన్యం అభినందిస్తోందన్నారు. శుక్రవారం హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో బెస్ట్ ఆర్గనైజేషన్ ఫర్ క్వాలిటీ సర్కిల్ మూమెంట్ అవార్డును మహారాష్ట్ర, తమిళనాడు గవర్నరు సిహెచ్ విద్యాసాగరరావు, తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు చేతులమీదుగా రాంకో సంస్థ అధికారులు అందుకున్నట్లు ఆయన వివరించారు.

రాష్టస్థ్రాయి క్రీడా పోటీలకు
కౌతవరం విద్యార్థుల ఎంపిక
గుడ్లవల్లేరు, సెప్టెంబర్ 3: కౌతవరం జిల్లా పరిషత్ హైస్కూల్‌కు చెందిన 11 మంది విద్యార్థినులు రాష్టస్థ్రాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. గన్నవరంలో శనివారం నిర్వహించిన జిల్లాస్థాయి హాకీ, ఫుట్‌బాల్ పోటీల్లో విజయకేతనం ఎగురవేశారు.