కృష్ణ

ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం(కోనేరుసెంటర్): ప్రజా సమస్యలపై తెలుగుదేశం పార్టీ నిరంతర పోరాటం చేస్తుందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా మూడవ రోజైన శనివారం ఉదయం నగరంలోని మాచవరంలో, సాయంత్రం మండల పరిధిలోని కానూరు గ్రామంలో ఆయన పర్యటించారు. ఆయా ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ప్రభుత్వ పరంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరు తెన్నులను అడిగి తెలుసుకున్నారు. తొమ్మిది నెలల వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. ఎక్కడా లేని నిబంధనలు తీసుకు వచ్చి సంక్షేమ పథకాలలో పెద్ద ఎత్తున కోత విధిస్తున్నారన్నారు. గత కొనే్నళ్లుగా పెన్షన్, రేషన్ తీసుకున్న వారిని నేడు నిబంధనల పేరుతో తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ప్రభుత్వానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తగు విధంగా గుణపాఠం చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాథం (చంటి), కోస్తా మురళి, గోపు సత్యనారాయణ, పద్మనాభుని శేఖర్, లంకిశెట్టి నీరజ, బొడ్డు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

సకాలంలో లేఅవుట్‌లు పూర్తి చేయని అధికారులపై చర్యలు తప్పవు
* కలెక్టర్ ఇంతియాజ్

గన్నవరం, ఫిబ్రవరి 22: ఇళ్ళ స్థలాల లేఅవుట్ పనులు నిర్దేశిత సమయంలో పూర్తి చేయని అధికారులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టరు ఎఎండీ ఇంతియాజ్ హెచ్చరించారు. శనివారం గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో పేదలకు నివేశన స్థలాల పంపిణీకి నిర్ణయించిన భూములను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ఉగాది నాటికి 25లక్షల మంది పేదలకు నివేశన స్థలాలు అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారని, అటువంటి కార్యక్రమంలో అధికారులు అలసత్వం లేకుండా విధులు నిర్వర్తించాలని, ఎలాంటి అలసత్వాన్ని ఉపేక్షించేది లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లేఅవుట్ పనులు వెంటనే పూర్తిచేసి వౌలిక సదుపాయల కల్పన వంటి పనులను నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలన్నారు. లబ్ధిదారులకు ప్లాట్‌లు లాటరీ పద్ధతిలో కేటాయించాలని సూచించారు. అనంతరం లేఅవుట్‌లు వేసిన భూముల్లో రోడ్లు, డ్రైనేజిలకు సంబంధించిన పనులు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ఇంతియాజ్ పరిశీలించారు. కలెక్టరుతో పాటు డ్వామా పీడీ సూర్యనారాయణ, తహశీల్దార్ వి మురళీకృష్ణ, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.