కృష్ణ

రాష్ట్రానికి పట్టిన శని రోజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంజిసర్కిల్, సెప్టెంబర్ 6: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్ ఆడ వారిని అడ్టం పెట్టుకుని దుష్ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. మంగళవారం నగరంలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చసిన విలేఖర్ల సమావేశంలో ఆయన ఎమ్మెల్యే రోజాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి పట్టిన పెద్ద శని రోజా అని వ్యాఖ్యానించారు. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండటంతోనే రాష్ట్ర ప్రజలకు దూరం అయ్యామని, అనంతరం వైఎస్ రాజశేఖర్‌రెడ్డిన కలసి అనంతరం మూడురోజుల్లో ఆయన మరణించాడని, తరువాత వైయస్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మరుక్షణం లక్ష కోట్లు దోచుకున్న జగన్ జైలు బాటపట్టాడని విమర్శించారు. రోజా ఐరన్ లెగ్ గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. బిష్ముడి ముందు శిఖండిని పెట్టినట్లు జగన్ రోజాను ముందు పెట్టి అడవారితో రాజకీయాలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం ఇష్టంలేకనే జగన్ తన వారితో రాష్ట్రంలో జరగుతున్న ఉద్యమాలను రెచ్చకోడుతున్నాడని తెలిపారు. కాపు ఉద్యమంలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ నాయకుల బండారం బట్టబైయిలైయిందని భూమా వ్యవహరంతో వెలుగుచూసిందన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్దిలో నడుస్తుంటే, చూసి ఉండలేకనే అన్నింటికి అడ్డు తగులుతున్నాడని ఆరోపించారు. కృష్ణా పుష్కరాలు, రాయలసీమలో పంటలకు నీరందించడం వంటి పనుల్లో బిజీగా గడిపి కొన్ని రోజులు విహార యాత్రలకు వెళ్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా జగన్‌కు కనీస అర్హతలేదన్నారు. తను పిలుపునిచ్చిన ఇంటింటికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో తాను మాత్రం పాల్గొనకుండా తాను మాత్రం హైదరాబాద్‌తో పాటు బెంగుళూరులో గడుపుతున్నాడన్నారు. ఆర్థం పర్థం లేని వైసిపి నేతల ప్రవర్తనపై రాష్ట్ర ప్రజలు మరింత విసిగిపోయారని ఆయన చెప్పారు.
పుష్కరాల్లో చోరీలకు పాల్పడిన
మరో 8 అంతర్రాష్ట్ర గ్యాంగులు అరెస్టు
రూ. సుమారు 2 లక్షలు నగదు
198 గ్రాముల బంగారం స్వాధీనం
విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 6: కృష్ణా పుష్కరాల్లో చోరీలకు పాల్పడిన మరో ముఠాను సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే మూడు దఫాలుగా 18 గ్యాంగులను అరెస్టు చేసి భారీగా సొత్తు రికవరీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మూడు రాష్ట్రాలకు చెందిన ముఠాలకు సంబంధించి మరో 26 మంది నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి సుమారు ఎనిమిది లక్షల విలువైన బంగారం, నగదు రికవరీ చేసినట్లు నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ తెలిపారు. కమిషనరేట్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక ముఠా, మహారాష్టక్రు చెందిన నాలుగు గ్యాంగులు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ముఠా అరెస్టు చేసిన వారిలో ఉన్నారు.
* ఐదుగురు మధ్యప్రదేశ్ ముఠా
మధ్యప్రదేశ్‌కు చెందిన దూలత్ బన్‌షీలాల్ (46), నవీన్‌ప్రకాష్ (40), కిషోర్ శివరామ్ (53), నిరంజన్ కుషీరామ్ 960), వినోద్ సంజయ్ (27)లు ముఠాగా ఏర్పాడి పద్మావతి ఘాట్‌లో సంచరిస్తూ మూడు నేరాలకు పాల్పడ్డారు.
* మహారాష్టక్రు చెందిన నాలుగు ముఠాలు
మహారాష్ట్ర అహ్మద్‌నగర్‌కు చెందిన రంజిత్ అంకుష్ బడుగుజార్ (40), మంగల్ రంజిత్ బడుగుజార్ (35), రతన్ ఉమాజి బడుగుజార్ (55), కైలాష్ కిషన్ సింగ్ (34), సతీష్ జయసింగ్ (29), అరుణ్ గోవర్ధన్ సోలంకి (40), కుణాల మహేంద్ర పవార్ (23), నానారాం భోస్లే (24), గణేష్ దామోదర్ (36), విజయ్ వికాస్ సోలంకి (32), విజయ్ జయసింగ్ (43), షేక్ బషీర్ (35), నవీన్ అంకుష్ (40), అంబుదాస్ (33), రాజ్ నరవింద్ (20), గంగాధర్ నాయక్ (27), ఆశిష్ కండేకర్ (32) హేమ్‌నాధ్ (28) ముఠాగా ఏర్పడి బస్టాండు, పద్మావతి ఘాట్, కృష్ణవేణి, స్వరాజ్య మైదాన్, పెనమలూరు పుష్కరనగర్ తదితర చోట్ల మొత్తం 16 నేరాలకు పాల్పడ్డారు.
* ఎపి ముఠా
చిత్తూరు జిల్లా, ఓజి కుప్పంకు చెందిన కుంచాల జగన్నాధం (50), కుంచాల చందులు (33), విశాఖపట్నంకు చెందిన సూర్యప్రకాష్ ముఠాగా ఏర్పడి భక్తుల వస్తువులు దొంగిలించారు. పున్నమి, కృష్ణవేణి, పద్మావతి ఘాట్లలో మొత్తం ఏడు చోరీలకు పాల్పడ్డారు.
ఆయా కేసుల్లో మొత్తం 26 మందిని 26 కేసుల్లో అరెస్టు చేసి ఎనిమిది లక్షలు విలువైన 198 గ్రాముల బంగారం, లక్షా 97 వేల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు సిపి చెప్పారు. విలేఖరుల సమావేశంలో జాయింట్ పోలీసు కమిషనర్ పి హరికుమార్, డిసిపి పాల్‌రాజు, క్రైం అదనపు డిసిపి రామకోటేశ్వరరావు, ఎసిపిలు పాల్గొన్నారు.