కృష్ణ

అన్న క్యాంటీన్ల మూసివేత గర్హనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం(కోనేరుసెంటర్): పది మంది కార్మికులకు కడుపు నిండా అన్నం పెట్టే అన్న క్యాంటీన్ల మూసివేత గర్హనీయమని మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్న క్యాంటీన్ల మూసివేతను నిరసిస్తూ సోమవారం స్థానిక మూడు స్థంభాల సెంటరులో వంటా-వార్పు నిర్వహించి కార్మికులకు భోజన వసతి కల్పించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపిచంద్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్‌లు పంచపర్వాల కాశీ విశ్వనాథం (చంటి), బలగం విజయశేఖర్, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మరకాని పరబ్రహ్మం, మాజీ కౌన్సిలర్లు కొట్టె వెంకట్రావ్, బత్తిన దాస్, తెలుగు మహిళ పట్టణ అధ్యక్షురాలు లంకిశెట్టి నీరజ తదితరులు పాల్గొన్నారు.

చిన్నారులకు తప్పిన పెను ప్రమాదం
* కనకవల్లి ప్రాథమిక పాఠశాలలో ఊడిపడిన పెచ్చులు
తోట్లవల్లూరు, ఫిబ్రవరి 24: మండలంలోని కనకవల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల్లో శ్లాబు పెచ్చులు ఊడి కింద పడ్డాయి. హెచ్‌ఎం సంధ్యరాణి సోమవారం పాఠశాలకు వచ్చి తలుపులు తెరవగా పెచ్చులు ఊడి కిందపటం చూసి ఆశ్చర్యం పోయారు. ఆదివారం సెలవు కావటంతో పాఠశాలకు పిల్లలు రాలేదు కాబట్టి విద్యార్థులకు పెనుప్రమాదం తప్పింది. అదేగనుక పాఠశాల జరిగే సమయంలో శ్లాబు పెచ్చులు ఊడి పడి ఉంటే విద్యార్థులకు ప్రమాదం జరిగేది. కనుక ఇప్పటికైన విద్యాశాఖ అధికారులు స్పందించి మర్మమత్తులు చేయించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎంఈఓ జి వెంకటేశ్వరరావు కనకవల్లి పాఠశాలను సందర్శించారు. వెంటనే విద్యార్థులకు పాఠశాల మరమత్తులు చేసేదాకా గ్రామ పంచాయతీ కార్యాలయంలో గల గదిలో విద్యార్థులకు పాఠాలు చెప్పాలని ఉపాధ్యాయులకు సూచించారు.

ఇఎస్‌ఐలో అవినీతిపై పూర్తిస్థాయి విచారణ జరపాలి
మచిలీపట్నం(కల్చరల్), ఫిబ్రవరి 24: ఇఎస్‌ఐలో జరిగిన అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి చందారులకు న్యాయం చేయాలని సీఐటీయు పట్టణ కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. ఇఎస్‌ఐలో జరిగిన అవినీతి, అవినీతికి సంబంధించిన పైకాన్ని సమున్నత శాఖకు జమ చేయటంతో పాటు దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఇఎస్‌ఐ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో నాసిరకం మందులు, వైద్య పరికరాలు కొనుగోలు చేయడం వల్ల 6వేల కోట్లు వరకు అవినీతి జరిగిందన్నారు. దీనికి సంబంధించిన సొమ్మును తిరిగి జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు ఎం వెంకటేశ్వరరావు, వివి రమణారావు, కెవి గోపాలరావు, సిహెచ్ బుల్లెమ్మ, మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడు శ్రీనివాసరావు, లీలాకుమార్, వెంకటేశ్వరమ్మ, మూర్తి తదితరులు పాల్గొన్నారు.

రాజాగారి సెంటరులో బారికేడింగ్‌ను తొలగించండి
* ఎస్పీకి అఖిలపక్ష నేతల వినతి
మచిలీపట్నం(కోనేరుసెంటర్), ఫిబ్రవరి 24: ప్రజలకు తీవ్ర ఇబ్బందికరంగా మారిన స్థానిక రాజాగారి సెంటరులోని బారికేడింగ్‌ను తొలగించాలని అఖిలపక్ష నాయకులు సోమవారం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు కోరారు. ప్రమాదాలు జరుగుతున్నాయన్న కారణంతో రాజాగారి సెంటరులో రోడ్డును బ్లాక్ చేసే విధంగా ఏర్పాటు చేసిన బారికేడింగ్ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఇబ్బందులను వివరిస్తూ వినతిపత్రాన్ని ఎస్పీకి అందజేశారు. ఈ బారికేడింగ్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ట్రాఫిక్ సమస్య కూడా ఉత్పన్నమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, బీజేపీ నాయకులు పంతం వెంకట గజేంద్రరావు, కూనపరెడ్డి శ్రీనివాసరావు, బందరు నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ బండి రామకృష్ణ, సీపీఐ నాయకుడు మోదుమూడి రామారావు తదితరులు పాల్గొన్నారు.

నూతన చెక్ పోస్ట్ ప్రారంభం
ముదినేపల్లి, ఫిబ్రవరి 24: సీఎం జగన్మోహనరెడ్డి ఆశీస్సులతో కైకలూరు మార్కెట్ యార్డు చైర్మన్‌గా తొలి బడుగు, బలహీన వర్గాలకు చెందిన మహిళ మా సోదరి గుమ్మడి శైలజ ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చెందాలని, రైతులకు లాభసాటిగా ఉండాలని కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) ఆకాంక్షించారు. సోమవారం మండల కేంద్రం ముదినేపల్లిలో నూతన చెక్‌పోస్టును ఆయన ప్రారంభించారు. కైకలూరు మార్కెట్ యార్డు చైర్మన్ గుమ్మడి పద్మజ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ షేక్ రఫీ, సభ్యులు గుడివాడ నాగలక్ష్మి, ఉమ్మిశెట్టి వాణి, బొమ్మనబోయిన గోకర్ణ, వడుపు గగన ఏసుబాబు, వైకాపా నాయకులు నిమ్మగడ్డ భిక్షాలు, గుమ్మడి వెంకటేశ్వరరావు, గుడివాడ బాబి, ఈడే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.