కృష్ణ

సంపూర్ణ అక్షరాస్యత సాధనకే విద్యా సంస్కరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: సంపూర్ణ అక్షరాస్యత సాధన కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విద్యా విధానంలో పలు సంస్కరణలు తీసుకు వస్తున్నారని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు, భూగర్భ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. నవరత్నాలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జగనన్న వసతి విద్యా దీవెన పథకాన్ని జిల్లా కేంద్రం మచిలీపట్నంలో సోమవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. జడ్పీ కనె్వన్షన్ సెంటరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లాకు సంబంధించి 1.15లక్షల మంది విద్యార్థులకు గాను రూ.110.58కోట్ల మేర జగనన్న వసతి దీవెన కింద ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ నిరుపేద కుటుంబాల్లోని పిల్లలకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావడం కోసం జగనన్న వసతి దీవెన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిందన్నారు. ఈ పథకం కింద ఐటీఐ చదివే విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్ చదివే విద్యార్థులకు రూ.15వేలు, డిగ్రీ ఆపై కోర్సులు చదివే విద్యార్థులకు రూ.20వేలు చొప్పున మెస్ ఛార్జీలను వారి తల్లుల వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 33 శాతం నిరక్షరాస్యత ఉందన్నారు. దీన్ని పూర్తిగా రూపుమాపేందుకు అమ్మఒడి ద్వారా విద్యార్థులకు ఆర్థిక భరోసా, నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ, జగనన్న వసతి దీవెన కింద మెస్ ఛార్జీలు ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు గాను రానున్న విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. ప్రజా సంకల్ప యాత్ర, ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రాత్రింపగళ్లు శ్రమిస్తున్నారన్నారు. సభకు అధ్యక్షత వహించిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన వారికి సైతం ఉన్నత విద్య అందించాలన్నదే ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్ష అన్నారు. విద్యార్థులు ఉన్నతమైన ఆశయాలతో విద్యనభ్యసించి తమ తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలన్నారు. చదువు తప్ప వేరే ధ్యాస లేకుండా చూడాలన్నారు. సరదాలను పక్క పెట్టి కసిగా చదివి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలన్నారు. కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ మాట్లాడుతూ ప్రతి పేద మధ్య తరగతి కుటుంబాలకు ఉన్నత చదువులు చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రవేశ పెట్టిన జగనన్న వసతి దీవెన పథకాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా. కె మాధవీలత, జేసీ-2 మోహన్ కుమార్, ఆర్డీవో ఖాజావలీ, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ కె సరస్వతి, డ్వామా పీడీ జివి సూర్యనారాయణ, ఎస్‌ఎస్‌ఎ పీఓ ప్రసాద్ బాబు, నగర పాలక సంస్థ కమిషనర్ శివరామకృష్ణ, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్ దాదా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.