కృష్ణ

పేదల భూములు తీసుకోవడం గర్హనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ: నివేశన స్థలాలు కోసం పేద వర్గాలు ఎన్నో సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములను తీసుకోవడం విచిత్రంగా ఉందని మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మంగళవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ నాగాయలంక మండలం మర్రిపాలెంకు చెందిన పేద రైతు పోతురాజు ఆత్మహత్యయత్నం, లక్ష్మీపురంలో ఉప్పర్లకు చెందిన భూమిని తీసుకుంటున్నారన్న ఆవేదనతో గుండెపోటుతో మృతి చెందిన సంఘటనల ద్వారా పేదలు ఎంత ఆవేదనలో ఉన్నారో ప్రభుత్వం గుర్తించి తప్పును సరిదిద్దుకోవాలని, అలా కాకుండా మొండిగా వ్యవహరించటం తగదని హితవు పలికారు. ఎస్టీ సొసైటీ భూములను తీసుకుంటున్నారని దళితులు ఆందోళన చేస్తున్నారని, ప్రభుత్వం ఇచ్చే నివేశన స్థలాలు నివాసయోగ్యంగా ఉండాలని, ఊరికి దూరంగా డొంకల్లో కూడా కొన్ని చోట్ల నివేశన స్థలాలు ఇస్తున్నారని ఆవేదన చెందుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి సాగు చేసుకుంటున్న భూముల జోలికి వెళ్లరాదని బుద్ధప్రసాద్ కోరారు. ఈ కార్యక్రమంలో కె వెంకటేశ్వరరావు, మత్తి శ్రీనివాసరావు, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ద్వాదశ ప్రదక్షిణలు, పవళింపుసేవ
మోపిదేవి, ఫిబ్రవరి 25: దక్షిణ కాశీ పెదకళ్లేపల్లి శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం స్వామివారి ద్వాదశ ప్రదక్షణలు, పుష్పసెయ్యాలంకృత పవళింపుసేవ కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు బద్దు నాగవరప్రసాద్, అర్చకులు ఫణిశర్మ బ్రహ్మోత్సవంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి పల్లకీని మోసేందుకు పోటీపడ్డారు. అనంతరం స్వామివారి పవళింపుసేవ పూజలు అర్చకులు జితేంద్రశర్మ ఆధ్వర్యంలో శాస్త్రోంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల ఏసీ జివిడిఎన్ లీలాకుమార్, ఆలయ సూపరింటెండెంటు బసవశంకర ప్రసాద్, చెన్నకేశవ, గుమ్మడి వెంకటేశ్వరరావు, అర్జా వెంకటేశ్వరరావు, కె రామారావు, కె సీతారామాంజనేయులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్ధప్రసాదములు అందుకున్నారు.