కృష్ణ

ప్రజా సమస్యల పరిష్కారంలో ఆధునిక సమాచార వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం(కోనేరుసెంటరు): ప్రజలకు సత్వర సేవలందించడమే లక్ష్యంగా ఆధునిక సాంకేతిక సమాచార వ్యవస్థకు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) శ్రీకారం చుట్టారు. ప్రతి నిత్యం నియోజకవర్గం నుండి మంత్రి కార్యాలయం వద్దకు ఎన్నో సమస్యలతో వస్తున్న ప్రజానీకానికి సత్వర సేవలందించేందుకు ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు వైర్‌లెస్ సెట్లు అందుబాటులోకి మంత్రి తీసుకువచ్చారు. ఆయా వార్డులలో మంచినీటి సమస్యలు, డ్రైనేజీ, శానిటేషన్ వంటి వివిధ సమస్యలతో ప్రజలు వచ్చినప్పుడు వెంటనే మంత్రి స్పందించి వైర్‌లెస్ సెట్‌లో మున్సిపల్ కమిషనర్, సంబంధిత విభాగం ఇంజనీరుకు సమస్య తెలియజేసి వెంటనే పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇస్తున్నారు. మంత్రి ఆదేశాలు సంబంధిత మున్సిపల్ అధికారులు స్వీకరించి సమస్య ఉన్న ప్రాంతాలకు సిబ్బందిని పంపి వెంటనే వారి సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. పట్టణంలో మున్సిపల్ అధికారులు వివిధ విభాగాల సిబ్బందికి సుమారు 40 వరకు వైర్‌లెస్ సెట్లు, ఇటీవల నగరంలోని 51 వార్డు సచివాలయాలకు ఒక్కొక్క వైర్‌లెస్ సెట్ చొప్పున 51 మొత్తం 90 వరకు మంత్రి ఆదేశాల మేరకు సమకూర్చినట్లు మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ తెలిపారు. ప్రతి వార్డు సచివాలయంలో ఉదయం 5గంటలు నుంచి 8గంటలు వరకు శానిటేషన్ సెక్రటరీ వద్ద, తదుపరి ఉదయం 10.30 వరకు ఇంజనీరింగ్ సెక్రటరీ వద్ద, వార్డు అడ్మిన్ వద్ద ఈ విధంగా వార్డు సెక్రటరీల వద్ద వైర్‌లెస్ సెట్టు ఉంటుందని, ఎప్పటికప్పుడు మంత్రి, మున్సిపల్ కమిషనర్, సంబంధిత ఇంజనీరింగ్ అధికారుల వద్ద నుండి వచ్చే ఆదేశాలు అనుసరించి సిబ్బంది ప్రజలకు తక్షణ సేవలు అందిస్తున్నారని తెలిపారు. కంట్రోల్ రూము నుండి వీడియో కాన్ఫరెన్సు ద్వారా నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రత్యక్షంగా వీక్షించడానికి, అవసరమైన ఆదేశాలు ఇవ్వడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు. నగరంతో పాటు రూరల్‌లో కూడా విద్యుత్, మంచినీటి సరఫరా వంటి అత్యవసర విభాగాలకు కూడా వైర్‌లెస్ సెట్లు సమకూర్చాలని మంత్రి యోచిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.