కృష్ణ

చంద్రబాబు అరెస్ట్ హేయమైన చర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు: మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పోలీసులు అనుమతి తీసుకుని విశాఖపట్నం పర్యటనకు వెళ్ళితే, అక్కడ వైసిపి నాయకులు గుండాలాగా వ్యవహరిస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర చూపటం దారుణమని రాష్ట్ర ఉపాధిహామి మండలి డైరెక్టర్ వీరంకి వెంకట గురుమూర్తి పేర్కొన్నారు. తోట్లవల్లూరులో బుధవారం విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గురుమూర్తి మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును అరెస్ట్ చేయటం హేయమైన చర్యని, దీనిని తీవ్రంగా ఖడిస్తున్నామని అన్నారు. పోలీసుల అనుమతితో విశాఖపట్నంలో పర్యట చేస్తుంటే, వైసిపి మంత్రి ప్రేస్‌మీట్‌పెట్టి చంద్రబాబు పర్యటనను అడ్డుకోమని వైసిపి కార్యకర్తలకు పిలుపు నిస్తే పోలీసులు వైసిపి నాయకులను ఎయిర్‌పోర్టుకు రాకుండా ఎందుకు అడ్డుకోలేదని అన్నారు. అదే టీడీపీ వాళ్ళు ఆందోళనకు పిలుపు నిస్తే ముందస్తుగా హౌస్ అరెస్ట్‌లు చేస్తారని, అదే వైసీపీ నాయకులు చేస్తే పోలీసులు చక్కగా స్వాగతిస్తున్నారని అన్నారు. టిడిపి ప్రభుత్వం హాయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలు చేస్తే వారికి ఎటువంటి ఆటంకం కలగకుండా బందోబస్తి కల్పించామని గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వం మాత్రం ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబుకు సెక్యూరిటీ కల్పించి పర్యటన చేయించాల్సి పోయి, మీరే కార్యకర్తలను పంపించి కోడిగ్రుడ్లు, చెప్పులు, టమోటాలతో దాడి చేయించటం హేయమైన చర్య అన్నారు. ఆందోళన చేసిన వార్ని అరెస్ట్ చేయకుండా చంద్రబాబును అరెస్ట్ చేసి తరలించటం వైసిపి ప్రభుత్వ తీరు పరాకాష్టకు చేరిందని విమర్శించారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని, తర్వలోనే ప్రజలు ఎదురుతిరిగి గుణపాఠం చేప్పే రోజు వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నెక్కలపూడి మురళీ, వల్లూరు రమేష్ తదితరులు పాల్గొన్నారు.