కృష్ణ

అవినీతికి పాల్పడితే సస్పెన్షనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: మీ పై వచ్చే ఏ ఒక్క అవినీతి ఆరోపణ నిరూపితమైనా సస్పెన్షన్ వేటు తప్పదని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు అన్నారు. గురువారం జిల్లా పోలీసు పెరేడ్ గ్రౌండ్ నందు హోంగార్డ్ దర్బార్ నిర్వహించారు. విధి నిర్వహణలో హోంగార్డుల సేవలు అభినందనీయమన్నారు. కానీ ఇటీవల కాలంలో కొంత మంది హోంగార్డులు అవినీతి, అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతూ హోంగార్డ్ వ్యవస్థకే మాయని మచ్చగా నిలుస్తున్నారన్నారు. ఒక విధంగా చెప్పాలంటే పోలీసు శాఖకు హోంగార్డ్ వ్యవస్థ వెన్నుముక వంటిదన్నారు. అటువంటి వ్యవస్థ కీర్తి ప్రతిష్ఠలను దిగజార్చే వారిని సహించేది లేదని హెచ్చరించారు. ఒక పక్క హోంగార్డుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వారి సమస్యలను పరిష్కరించటంతో పాటు నివేశన స్థలం లేని అర్హులైన హోంగార్డులకు ఉగాది రోజున పేద ప్రజలతో పాటు నివేశన స్థలాలు ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉందన్నారు. జిల్లాలో సుమారు 300 మంది హోంగార్డులకు నివేశన స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అక్రమ ఇసుక, మద్యం రవాణా నిరోధించడం కోసం జిల్లా వ్యాప్తంగా 52 చెక్ పోస్టులను, మొబైల్ పార్టీలను ఏర్పాటు చేశామన్నారు. హోంగార్డులు నిజాయితీగా విధులు నిర్వహించాలన్నారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే వారిని విధుల నుండి తొలగించే విషయంలో ఏ మాత్రం వెనుకాడమన్నారు. ఇందుకు ఉదాహరణ ఇటీవల విజయవాడ పేకాట క్లబ్‌లో పేకాట ఆడుతూ దొరకిన హోంగార్డును విధుల నుండి తొలగించడమేనన్నారు. రెండు రోజుల క్రితం మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నిమ్మించి గర్భవతిని చేసి పెళ్లికి నిరాకరించిన హోంగార్డును కూడా తొలగించడం జరిగిందన్నారు. పోలీస్ శాఖలో ఉన్న సిబ్బందిపై వచ్చే అవినీతి ఆరోపణలు నిరూపితమైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కానిస్టేబుల్ అయితే సస్పెండ్ అయిన తర్వాత మళ్లీ విధుల్లోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. హోంగార్డులను మాత్రం మళ్లీ విధుల్లోకి తీసుకునే అవకాశం లేదన్నారు. దీన్ని ప్రతి ఒక్క హోంగార్డు దృష్టిలో పెట్టుకుని అవినీతి ఆరోపణలు లేకుండా ప్రజలకు సేవకులుగా పని చేయాలన్నారు. గతంలో నిర్వహించిన హోంగార్డు దర్బారులో వచ్చిన సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ధర్మేంద్ర, బందరు డీఎస్పీ మొహబూబ్ బాషా, ఎఆర్ డీఎస్పీ సత్యనారాయణ, స్పెషల్ బ్రాంచ్ సీఐ చంద్రశేఖర్, డీసీఆర్‌బీ సీఐ శ్రీనివాసరావు, చిలకలపూడి సీఐ వెంకట నారాయణ, ఆర్‌ఐలు చంద్రశేఖర్, వెంకట్రావ్, ఆర్‌ఎస్‌ఐలు, హోంగార్డ్ యూనిట్ ఆర్‌ఎస్‌ఐ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.