కృష్ణ

‘ఫ్లైఓవర్’కు అడ్డంకులు లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, జనవరి 30: కనకదుర్గ ఫ్లైఓవర్ పనులకు ఎటువంటి ఆటంకాలు లేవని జిల్లా కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. స్థానిక దుర్గగుడి సమీపంలో భవానీపురం ప్రాంతాల్లో ఫ్లైఓవర్ నిర్మాణ పనులను కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫ్లైఓవర్ పనులు వేగంగా జరిగేలా చూసి కృష్ణా పుష్కరాలకు ముందుగానే పూర్తి చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన భవానీపురంలోని వక్ఫ్‌బోర్డు స్థలం 30 ఎకరాలు చదును చేసి జాతీయ రహదారులు ఆర్ అండ్ బి ఎస్‌ఇకు అప్పగించామన్నారు. ఇందులో ప్రస్తుతం ఉన్న అన్ని నిర్మాణాలను తొలగించి ప్రీకాస్టింగ్ పనులకు అప్పగించామన్నారు. పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు తాము సమీక్షిస్తూ షెడ్యూల్ ప్రకారం ఇచ్చిన గడువులో ఆయా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పనుల పర్యవేక్షణ విజయవాడ అర్బన్, విజయవాడ రూరల్, పెనమలూరు తహశీల్దార్లు పర్యవేక్షిస్తారన్నారు. ముందుగా కలెక్టర్ దుర్గగుడి వద్ద పైల్ లోడ్ టెస్టింగ్ నిమిత్తం జరుగుతున్న పనులను సోమా సంస్థ ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. పైల్ లోడ్ కెపాసిటీ, దాని సామర్ధ్యం నిర్మాణ వివరాలను సోమా జిఎం, డిజిఎంలు దాసు, అనంతరాములు కలెక్టర్‌కు వివరించారు. అనంతరం భవానీపురం వక్ఫ్ స్థలం, సితార సెంటరు వద్ద మినీ స్టేడియంలో జరుగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ పర్యటనలో అర్బన్ తహశీల్దార్ ఆర్.శివరాం, ఆర్ అండ్ బి నేషనల్ హైవే అథారిటీ డిఇ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.