కృష్ణ

తుమ్మలపల్లి కళాక్షేత్ర ఆవరణలో నేడు చంద్రన్న బీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 1: చంద్రన్న బీమా ప్రారంభోత్సవ కార్యక్రమం స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం మధ్యాహ్నం జరగనుందని జిల్లా కలెక్టర్ బాబు ఎ ఒక ప్రకటనలో తెలిపారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు బీమా కల్పించి ఆ కార్మికుని కుటుంబానికి రక్షణ కల్పించాలనేది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. చంద్రన్న బీమా పథకాలు అమలులో భాగంగా ప్రభుత్వం రూ.134.50 పైసలు బీమా ప్రీమియాన్ని చెల్లించడం జరుగుతోందన్నారు. ఈ పథకంలో భాగస్వామ్యం కావడానికి లబ్ధిదారులు కేవలం రూ.15 ప్రీమియాన్ని చెల్లించాల్సి ఉంటుంది. క్లెయిమ్ పరిష్కారానికి 15రోజుల సమయాన్ని నిర్ణయించామని ఆ మొత్తం లబ్ధిదారుని నామిని బ్యాంకు ఖాతాకు జమచేయడం జరుగుతుందని కలెక్టర్ బాబు ఎ తెలిపారు. చంద్రన్న బీమా అమలులో భాగంగా వివిధ ఉప పథకాల ద్వారా లబ్ధిదారులకు బీమా మొత్తాన్ని చెల్లించడం జరుగుతుందని ప్రమాద మరణం సంభోస్తే రూ.5లక్షలు, శాశ్వత అంగవైకల్యం సందర్భంలో 3లక్షల 62వేల 500, సహజ మరణానికి 30 వేలు, 9వ, 10వ/ఇంటర్ /ఐటిఐ చదువుకున్న వారి పిల్లలకు ఒక్కొక్కరికి రూ.1200 ఉపకార వేతనం ఇద్దరు పిల్లలకు మించకుండా అందజేయడం జరుగుతోందన్నారు.

ఉత్సవ ఏర్పాట్లు భేష్
* మంత్రి ఉమ కితాబు
ఇంద్రకీలాద్రి, అక్టోబర్ 1: దసరామహోత్సవాలను పురస్కరించుకొని వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో భక్తుల సౌకర్యం కోసం చక్కటి ఏర్పాట్లు చేశారని ఎపి జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై ఏర్పాటు చేసిన మీడియా పాయింట్‌లో శనివారం మంత్రి మాట్లాడుతూ దసరామహోత్సవాలు మొదటి రోజున అమ్మవారిని దర్శించుకోవటం, ఏర్పాట్లు పరిశీలించడానికి కెనాల్‌రోడ్ వినాయకుని గుడి వద్ద ఏర్పాటు చేసిన క్యూమార్గం గుండా కొండపైకి చేరుకున్నారు. అమ్మవారి దర్శనం తర్వాత మహామండపం ద్వారా కిందకు చేరుకొని అక్కడ ఏర్పాట్లు కూడా మంత్రి పరిశీలించారు. అర్జున వీధిని విస్తరించటం వలన భక్తులకు ఎంతో వెసలుబాటు కలిగింది. ఈసమావేశంలో మంత్రితోపాటు దుర్గగుడి కమిటీ చైర్మన్ యలమంచలి గౌరంగబాబు, ధర్మకర్తలు వెలగపూడి శంకరబాబు, పద్మాకర్, కోడే సూర్యకుమారి, తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా అమ్మవారి దర్శనం తర్వాత వీరికి ఇవో సూర్యకుమారి ప్రత్యేక ప్రసాదాలను అందజేశారు.