తెలంగాణ

కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: నీటి పంపకాలే ప్రధాన అజెండాగా కృష్ణానదీ యాజమాన్య బోర్డు శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశమైంది. నిర్వహణ మార్గదర్శకాలు, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల పరిధిలో టెలిమెట్రీ ఏర్పాట్లు, ఉమ్మడి జలాశయాల నిర్వహణ నిధులు, కొత్త ప్రాజెక్టులు తదితర పది అంశాలతో కూడిన అజెండాను బోర్డు రూపొందించింది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు కేవలం 200 టీఎంసీల నీరు మాత్రమే శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చింది. ఖరీఫ్‌ అవసరాలకు నీటి విడుదల శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల కింద తాగునీటి అవసరాలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం. బోర్డు సమావేశంలో ఛైర్మన్‌ రామ్‌చరణ్‌, సభ్య కార్యదర్శి సమీర్‌ ఛటర్జీతో పాటు తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి శైలేంద్రకుమార్‌ జోషి, ఆంధ్రప్రదేశ్‌ జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌ తదితరులు పాల్గొన్నారు.