ఆంధ్రప్రదేశ్‌

కృష్ణాడెల్టాకు రెండు టిఎంసీల నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయపురిసౌత్, మార్చి 11: కృష్ణా రివర్ బోర్డు ఆదేశాల మేరకు కృష్ణాడెల్టా ప్రాంతంలో మంచినీటి అవసరాల కోసం శుక్రవారం మధ్యాహ్నం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుండి ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా నీటిని జెన్కో ఎస్‌ఈ రాజనర్సయ్య విడుదల చేశారు. రోజుకు 4 వేల క్యూసెక్కుల చొప్పున రెండు టిఎంసిల నీటిని మూడు రోజుల పాటు విడుదల చేయనున్నట్లు తెలిపారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం శుక్రవారం సాయంత్రానికి 509.30 అడుగుల వద్ద కొనసాగుతోంది. ఇది 130.4887 టిఎంసీలకు సమానం. జంట నగరాల మంచినీటి అవసరాల కోసం సాగర్ ప్రాజెక్టు నుండి 800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుండి సాగర్ ప్రాజెక్టుకు 5200 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం 812.50 అడుగుల వద్ద కొనసాగుతోంది. ఇది 31.781 టిఎంసీలకు సమానం. నాగార్జునసాగర్ నుండి విద్యుత్ ఉత్పాదన కోసం ప్రధాన జలవిద్యుత్ కేంద్రం నుండి 2485 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. టోటల్ అవుట్‌ఫ్లోగా 3285 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు సాగర్ ప్రాజెక్టు అధికారులు వివరించారు.