ఆంధ్రప్రదేశ్‌

తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాల కోలాహలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్-విజయవాడ: కృష్ణా పుష్కరాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం వేకువజామున వైభవంగా ప్రారంభమయ్యాయి. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల కోసం ఎపి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. తెలంగాణలోని నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పుష్కరాల సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేశారు. రెండు రాష్ట్రాల్లో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని గ్రామాలు పుష్కరశోభను సంతరించుకున్నాయి. ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇతర శాఖల అధికారులు, సిబ్బంది కూడా పుష్కరాలను పర్యవేక్షిస్తున్నారు. పుష్కర ఘాట్ల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. గజ ఈతగాళ్లను, పడవలు అందుబాటులో ఉంచారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం ఎపిఎస్ ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ, రైల్వేశాఖ విస్తృత ఏర్పాట్లు చేశాయి. మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ వద్ద గొందిమళ్ల ఘాట్‌లో సిఎం కెసిఆర్ దంపతులు పుష్కర స్నానం చేశారు. అనంతరం కెసిఆర్ అలంపూర్‌లోని జోగులాంబ అమ్మవారిని సందర్శించి పూజలు చేశారు. ఇక, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు సతీసమేతంగా విజయవాడలోని దుర్గా ఘాట్‌లో పుష్కర స్నానం ఆచరించారు. శ్రావణ శుక్రవారం కావడంతో నదీ స్నానం చేసేందుకు మహిళలు అధికసంఖ్యలో తరలివచ్చారు.