మహబూబ్‌నగర్

ఖరీఫ్ నాటికి ప్రతి ఎకరాకు సాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వ్యవసాయానికి 9గంటల విద్యుత్
* పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
పాన్‌గల్, మార్చి 15: రైతాంగానికి ఖరీఫ్ నాటికి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రిజూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కేతేపల్లి గ్రామంలో రెండవ దశ మిషన్ కాకతీయ పనులను ఆయన ప్రారంభించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతాంగాన్ని ఆదుకునేందుకు 9గంటల నిరంతర విద్యుత్‌ను త్వరలోనే అందిస్తామని, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్దరణ జరుగుతుందన్నారు. టి ఆర్ ఎస్ ప్రభుత్వ హాయాంలో రైతాంగానికి ప్రజలకు సాగు, తాగునీరందించేందుకు సియం కేసి ఆర్ అహర్షిశలు కృషిచేస్తున్నారన్నారు. మిషన్ భగీరథ ద్వారా డిసెంబర్ నెలాఖరువరకు ప్రతి ఇంటికి నళ్లా నీటిని అందిస్తామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సియం కేసి ఆర్ రాష్ట్రంలోని అన్ని నదులను కలుపుతూ మోటార్ల ద్వారా మినరల్ వాటర్‌ను అందించనున్నట్లు చెప్పారు. రైతే దేశానికి వెన్నుముఖ కావున రైతాంగ సమస్యలపై ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని ఆయన అన్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి అవసరమని, మరుగుదొడ్లను నిర్మించుకోకుంటే ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అమోదయోగ్యంగా రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని మంత్రి తెలిపారు. ఇండ్లు లేని ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఐదులక్షల రూపాయలతో డబుల్ బెడ్‌రూంలను నిర్మించి ఇస్తుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి వెంకటేష్‌నాయుడు, జడ్పిటిసి రవి, విండో చైర్మెన్, వైస్‌చైర్మెన్ బాల్‌రెడ్డి, భాస్కర్‌యాదవ్, టి ఆర్ ఎస్ నాయకులు విష్ణువర్తన్‌రెడ్డి, చంద్రశేకర్‌నాయక్, గోవర్తన్‌సాగర్, సుదర్శన్‌రెడ్డి, నారాయణరెడ్డి, రఘునాథ్‌రెడ్డి, వీరసాగర్, చక్రవెంకటేష్, జగదీశ్వర్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, ప్రత్యేకాధికారి కృష్ణయ్య, ఎంపిడివో ఆంజనేయులు, తహశీల్దార్ లక్ష్మీనారాయణ, సర్పంచ్ రేవతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
విద్యతోనే బంగారు భవిష్యత్
విద్యతోనే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రిజూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని చింతకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలో పాఠశాలల అభివృద్ధితోపాటు వౌళిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం కృషిచేస్తుందని, విద్యాభివృద్దికోసం ప్రతి ఒక్కరు కృషిచేయాలన్నారు. విద్యతోనే దేశాభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. విద్యార్థులు లక్ష్యాలను ఎంచుకుని కష్టపడి చదవాలని ఆయన కోరారు. ప్రతి విద్యార్థి దినసరిగా పత్రికలు చదవాలని, పత్రిక పఠనంతోనే మేథోశక్తిని పెంపొందించుకోవచ్చన్నారు. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్తుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ఉపాద్యాయులు కృషిచేయాలని ఆయన కోరారు. అనంతరం ఉన్నత పాఠశాలలో దేశ ప్రథమ ఉపాద్యాయురాలు సావిత్రి బాయిపూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో ఎంపిపి వెంకటేష్, జడ్పిటిసి రవి, విండో చైర్మెన్ బాల్‌రెడ్డి, వైస్ చైర్మెన్ భాస్కర్, ఎంపిడివో ఆంజనేయులు, యంఇఓ లక్ష్మన్‌నాయక్, సర్పంచ్ కృష్ణయాదవ్, తాలూక ఎంపిటిసిల ఫోరం అద్యక్షులు కిరణ్‌కుమార్, పార్టీ నాయకులు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.