జాతీయ వార్తలు

ఏకాభిప్రాయానికి రాని ఎపి, తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: కృష్ణానదీ జలాల పంపకంపై ఎపి, తెలంగాణ మధ్య ఏకాభిప్రాయం సాధ్యం కాలేదు. ఇక్కడ బుధవారం జరిగిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశంలో ఈ ఉభయ రాష్ట్రాల ప్రతినిధులు ఎవరివాదనలు వారు వినిపించారు. బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం గత ఏడాది లాగానే మరో నెల రోజుల పాటు కృష్ణాజలాలను వినియోగించుకోవాలని కృష్ణా బోర్డు ఇరు రాష్ట్రాలకూ సూచించింది. దీనిపై ఏకాభిప్రాయం కుదరని నేపథ్యంలో సమావేశం వాయిదా పడింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా మళ్లించే 45 టిఎంసిల నీటిని తమకే కేటాయించాలన్న తెలంగాణ వాదనను ఎపి తిరస్కరించింది. బోర్డు పరిధిని నిర్ణయించకుంటే తమ భూభాగంలో నాగార్జునసాగర్ హడ్‌వాటర్ వర్క్సును తామే నిర్వహించుకుంటామన్న ఎపి సర్కారు ప్రతిపాదనను తెలంగాణ అంగీకరించలేదు. దీంతో ఏకాభిప్రాయ సాధనకు నెల రోజులు గడువు ఇస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. ఈలోగా ఏకాభిప్రాయానికి వచ్చి సమస్యకు తెర దించాలని కృష్ణాబోర్డు ఇరు రాష్ట్రాలకూ సూచించింది.