కరీంనగర్

హమ్మయ్య..నెగ్గాం...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, డిసెంబర్ 12: రాష్ట్రంలోని మెదక్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఏకగ్రీవంతో ఎమ్మెల్సీ స్థానాలు దక్కించుకున్న అధికార టిఆర్‌ఎస్ కరీంనగర్‌లోని రెండు స్థానాలను సైతం ఏకగ్రీవంగా దక్కించుకుని సత్తా చాటుకుంది. జిల్లా మంత్రి ఈటెల రాజేందర్ రంగంలోకి దిగి గత రెండ్రోజులుగా జరిపిన మంతనాలు ఫలించడంతో నలుగురు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల నుంచి తప్పుకున్నారు. శుక్రవారం ఇద్దరు స్వతంత్రులు మినుపాల తిరుపతిరావు, సరిళ్ల ప్రసాదరావు తప్పుకోగా, శనివారం మరో ఇద్దరు స్వతంత్రులు ముద్దసాని రంగయ్య, ముత్యాల ప్రియారెడ్డి అలియాస్ శ్రీప్రియారెడ్డి పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలను తెరాస కైవసం చేసుకుంది. టిఆర్‌ఎస్ తరపున నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, తానిపర్తి భానుప్రసాదరావు ఏకగ్రీవంగా ఎన్నికై, మరోమారు శాసనమండలిలో అడుగు పెట్టబోతున్నారు. జిల్లాలో 57 మంది జడ్పీటిసిలు, 817 మంది ఎంపిటిసిలు, 326 మంది కార్పోరేటర్లు, కౌన్సిలర్లు, ఇద్దరు ఎంపిలు, 9 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ మొత్తం 1212 మంది ఓటర్లుండగా, వీరిలో ఆరుగురు వివిధ కారణాలతో అనర్హులుగా మారగా, మొత్తం 1206 మంది ఓటర్లుగా ఉన్నారు. ఇందులో మెజారిటీ ప్రజాప్రతినిధులు అధికార టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు. అయినా, అధికార టిఆర్‌ఎస్ పార్టీ ఆది నుంచి వ్యూహాత్మకంగానే వ్యవహరించినట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధుల సంఖ్యా బలం తక్కువగా ఉన్న నేపథ్యంలో టిడిపి, బిజెపి, కాంగ్రెస్ ఎన్నికలకు దూరంగా ఉండేలా ఆయా పార్టీల పెద్దలతో మంత్రాంగం నడిపినట్లు, ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ చివరి నిమిషంలో చేతులేత్తేయడం కూడా టిఆర్‌ఎస్ మంత్రాంగంలో భాగమేనన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా మంత్రి ఈటెల రాజేందర్ జరిపిన మంతనాలు ఫలించడంతో జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలు తెరాస కైవసం చేసుకుని జిల్లాలో మరింత ఎదురులేని శక్తిగా అవతరించింది. ఇప్పటికే జిల్లాలోని 13 ఎమ్మెల్యేలకుగాను 12 ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపిలు ఉండగా, తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్సీలు టిఆర్‌ఎస్ ఖాతాలో జమ అయ్యాయి. ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నిక కావటంపై తెరాస పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగితేలారు. బాణాసంచా కాల్చుతూ, స్వీట్లు పంచుతూ సంబురాలు జరుపుకున్నారు. మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, పుట్ట మధు, బొడిగె శోభలు స్వయంగా సంబురాల్లో పాలుపంచుకోగా, ఎన్నికైన లక్ష్మణ్‌రావు, ప్రసాదరావులు పాల్గొని ఆనందాన్ని వ్యక్తం చేశారు. మొత్తం మీద ఏకగ్రీవం కోసం గులాబీ నేతలు చేసిన శతవిధాల ప్రయత్నాలు ఫలించడంతో మండలి ఎన్నికల ఉత్కంఠకు తెరపడగా, గులాబీ నేతలు హమ్మయ్యా అంటూ ఊపిరిపీల్చుకున్నారు.