కరీంనగర్

శ్రీరాంసాగర్ కాలువ ద్వారా రైతులకు నీరందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుల్తానాబాద్, ఆగస్టు 23: శ్రీరాంసాగర్ కాలువ డి-83, డి-86 ద్వారా రైతుల పొలాలకు నీరందించాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాలువ చివరి ప్రాంతాలకు నీరందించేందుకు గాను 6,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెద్దపల్లి జిల్లా ఏర్పాటును స్వాగతిస్తున్నామని, ముందు చూపుతోనే సిఎం కెసిఆర్ పెద్దపల్లిని జిల్లాగా ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. మంథని రెవెన్యూ డివిజన్‌లో కాల్వశ్రీరాంపూర్‌ను కలుపడాన్ని అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని, పెద్దపల్లి నియోజకవర్గంలోనే కాల్వశ్రీరాంపూర్ ఉండాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పాల రామారావు, నాయకులు కుమార్ కిషోర్, వెగోళం అబ్బయ్య, అమిరిశెట్టి తిరుపతి, రాజయ్య, రాంచంద్రం, గణేష్, సతీష్ పాల్గొన్నారు.