కరీంనగర్

మంచం పడుతున్న కొత్త బెగులూర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహదేవపూర్, ఆగస్టు 25: మండలంలోని కొత్త బెగులూర్ గ్రామంలో విష జ్వరాలు సోకి మంచాన పడ్డారు. బెగులూర్ గ్రామంలో విష జ్వరాలు తగ్గుముఖం పట్టలేదు. గ్రామంలో ఇప్పటికే విష జ్వరాల బారిన పడి 15 మంది మృత్యువాత పడ్డారు. నేటి వరకు ప్రతీ ఇంటిలో ఒక్కరు చొప్పన జ్వర పీడితులున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం లోపించింది. కొత్త బెగులూర్ గ్రామానికి చెందిన గాయ రాజగోపాల్‌కు రక్త కణాలు తగ్గడంతో హన్మకొండలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని రెండు రోజుల క్రితం ఇంటికి చేరుకున్నాడు. వచ్చినప్పటి నుంచి మరింత జ్వరం పెరిగి బాధ పడుతున్నాడు. కొత్త బెగులూర్ గ్రామంలో కూడా 30 కుటుంబాలకు పైగా ఉన్నాయి. వారిలో ఒక్కొక్కరు జ్వర పీడితులే. గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ద్వారా 800 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. 224 మందికి మలేరియా రక్త పరీక్షలు చేసి 24 మందికి డెంగీ వ్యాధి వచ్చిన్నట్లు వైద్యులు తెలిపారు. 89 మంది జ్వర పీడితులను గ్రామం నుంచి మహదేవపూర్ సామాజిక వైద్యశాలకు తరలించామని, అలాగే మరో 15 మందికి జిల్లా వైద్య శాలకు పంపించిన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. పారిశుద్ధ్య పాటించక పోవడంతో బెగులూర్‌లో రోజు రోజుకు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గ్రామంలో ఏం జరుగుతుందోనన్న భయంతో కొంత మంది బంధువుల ఇంటికి వెళ్లి పోతున్నారు. ఏది ఏమైనప్పటికీ గ్రామంలో విష జ్వరాలు మాత్రం తగ్గడం లేదు.