కరీంనగర్

సిఐడి విచారణ నివేదికను బహిర్గతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, ఆగస్టు 26: బంగారు తెలంగాణ నిర్మిస్తామని, ఇందులో ప్రతి నిరుపేదకు డబుల్ బెడ్‌రూం ఇళ్ళను నిర్మించి ఇస్తామని, గృహనిర్మాణ శాఖను బలోపేతం చేస్తామని చెప్పిన కెసిఆర్ తెలంగాణలో అధికారంలోకి రాగానే ఆ శాఖ అంటేనే ఏకగించుకోవడమే కాక, సిబ్బందిని రోడ్లపాలు చేస్తున్నారని మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. గృహ నిర్మాణ శాఖలో అవుట్‌సోర్సింగ్‌పై పని చేస్తున్న 1177 మందిని ఉన్న ఫలంగా తొలగించడాన్ని నిరసిస్తూ ఉద్యోగులు ఈ నెల 28 నుండి కలెక్టరేట్ ఎదుట రిలే దీక్షలు చేపట్టారు. ఇందులో బాగంగా శుక్రవారం పొన్నం ప్రభాకర్ రిలే దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు ప్రకటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతితో పేరుకు పోయిందన్న ఆలోచనతో సిఐడి చేత కెసిఆర్ విచారణ చేయించుతున్నారని, ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించినా కూడా ఇప్పటివరకు ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే సిఐడి నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. 15-20 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న వీరిని రోడ్డున పడేశారని వీరి కుటుంబాలను ఆదుకోవాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వ పెద్దగా సిఎంపై ఉందన్నారు. గృహ నిర్మాణ శాఖలో పనిచేసే వారంతా దొంగలే అన్న విధంగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా తొలగించిన అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులందరిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, వీరికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతుంటుందని ఈ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. ప్రభాకర్ వెంట కాంగ్రెస్ నాయకులు కర్ర రాజశేఖర్, టేల భూమయ్యలు వెంట రాగా, ఉద్యోగుల సంఘం ప్రతినిధులు జగదీశ్వర్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.