కరీంనగర్

ఆరుగురు కౌన్సిలర్ల మూకుమ్మడి రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, ఆగస్టు 26: సిరిసిల్లను జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ ఆరుగురు మున్సిపల్ కౌన్సిలర్లు మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. ఈమేరకు శుక్రవారం విపక్ష పార్టీలకు చెందిన ఆరుగురు మున్సిపల్ కౌన్సిలర్లు తొలుత చైర్మన్ చాంబర్‌లో తన రాజీనామా పత్రాలను పూరించి అనంతరం మున్సిపల్ కమిషనర్‌కు సమర్పించారు. కౌన్సిల్‌లో చైర్‌పర్సన్‌తో కలిపి 33 మంది కౌన్సిలర్లు ఉండగా, రాజీమానామాలు సమర్పించిన వారిలో ముగ్గుకు కాంగ్రెస్, ముగ్గురు బిజెపి, ఒక టిడిపి కౌన్సిలర్ ఉన్నారు. జిల్లా సాధనలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వీలుగా మున్సిపల్ కౌన్సిల్‌లోని కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బుర్ర నారాయణగౌడ్, కాంగ్రెస్ కౌన్సిలర్లు వెల్ముల స్వరూప, మడుపు శ్రీదేవి, బిజెపి ప్లోర్ లీడర్ ఎర్రం వెంకట్రాజం, బిజెపి కౌన్సిలర్లు గడ్డం లత, బీమవరం రాధిక, టిడిపి కౌన్సిలర్ దార్ల సందీప్‌లు ఉన్నారు. తొలుత వీరు జిల్లా సాధన ఉద్యమాన్ని బోలోపేతం చేయడానికి రాజీనామాలు సమర్పించాలని విపక్ష సభ్యులు చైర్‌పర్సన్ సామల పావనిని కోరారు. జిల్లా సాధన జెఎసి నాయకులు, అఖిలపక్షం నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ఈ సందర్భంగా హాజరుకాగా వీరి సమక్షంలో కమిషనర్‌కు రాజీమానామా పత్రాలు సమర్పించారు. అనంతరం రాజీనామాలు చేసిన కౌన్సిలర్లును పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు నేతలు పూల మాలలతో అభినందించారు.
ట్రాక్టర్లతో నిరసన ప్రదర్శనలు
‘సిద్దిపేట వద్దు-సిరిసిల్ల ముద్దు’ అంటూ ముస్తాబాద్ మండలంలోని నాలుగు గ్రామాల ప్రజలు సిరిసిల్లకు తరలివచ్చి నిరననలు చేపట్టారు. ముస్తాబాద్ మండలాన్ని సిద్దిపేట జిల్లాలో చేర్చుతున్నట్టు ముసాయిదా నోటిఫికేషన్‌లో చేర్చిన అంశంపై వీరు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ మండలంలోని ఆవునూర్, తుర్కపల్లి, గూడెం, కొండాపూర్ గ్రామాలకు చెందిన ప్రజలు శుక్రవారం ట్రాక్టర్లపై ర్యాలీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా నుండి వీరు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజలు తమ డిమాండ్లతో ప్రదర్శన కొనసాగించగా, గ్రామాల నుండి వచ్చిన ట్రాక్టర్లు ర్యాలీలో పాల్గొన్నాయి. సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయం వరకు వీరు నిరసన ర్యాలీ కొనసాగించి, ఇక్కడ ధర్నా చేపట్టారు. సిరిసిల్లను జిల్లా చేయాలని లేని పక్షంలో తమ గ్రామాలను కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. తమను అకారణంగనా సిద్దిపేట జిల్లాలో కలుపరాదంటూ వీరు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం తమ మొరను వినిపించుకోని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని నాయకులు హెచ్చరించారు.