కరీంనగర్

మున్సిపల్ సమావేశం వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోరుట్ల, ఆగస్టు 29: కోరుట్ల మున్సిపల్ సమావేశం 36 అజెండా అంశాలతో నిర్వహించాల్సి ఉండగా మున్సిపల్ చైర్మన్ శీలం వేణు సమావేశాన్ని అర్ధంతరంగా వాయిదా వేయ డం ఉద్రిక్తలకు దారి తీసింది. చైర్మన్‌కు వాయిదా వేసే అధికారం లేదని, కౌన్సిలర్ ఇందూరి సత్యం శిరోమండనం చేసుకుని కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఆయనతో పాటు కౌన్సిలర్ గండ్ర రాజు, తిరుమల గంగాధర్, రియాజ్, లోకిని రాజేశ్‌లు చైర్మన్ వైఖరిపై మండిపడ్డారు. అనంతరం విపక్ష కౌన్సిలర్లు మాట్లాడుతూ చైర్మన్ భయపడి సమావేశాన్ని రద్దు చేయడమే కాకుండా కార్యాలయం చుట్టు బందోబస్తును ఏర్పాటు చేసుకోవడం పిరికి చర్యగా విమర్శించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. ఈసమావేశంలో కమిషనర్ వాణిరెడ్డి, డిఇ ప్రభాకర్ అన్ని శాఖల అధికారులు ఉన్నారు.