కరీంనగర్

ఎన్టీపిసిలో ఐక్య ఫ్రంట్ జెండా ఎగురవేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, ఆగస్టు 29: ఎన్టీపిసి గుర్తింపు సంఘం ఎన్నికల్లో యూనైటెడ్ ఐక్య ఫ్రంట్ జెండాను ఎగురవేసి సత్తా చాటుకుందామని ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ పిలుపునిచ్చారు. సోమవారం గౌతమీనగర్‌లోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ హక్కులను తాకట్టు పెట్టే యూనియన్లను ఎన్నుకోని బాధపడొద్దని, సమస్యలన్నింటిని పరిష్కారం చేసేందుకే సంఘాలన్ని ఒక్కటయ్యాయని చెప్పారు. టిఆర్‌ఎస్ పార్టీపైన అభిమానం ఉన్న ఉద్యోగులంతా ఐక్య ఫ్రంట్‌నే గెలిపించాలని కోరారు. మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎన్టీపిసి ఉద్యోగుల హక్కుల సాధన ఐక్య ఫ్రంట్‌తోనే సాధ్యమవుతుందని చెప్పారు.
ఐక్య ఫ్రంట్ నేత సిహెచ్. ఉపేందర్ మాట్లాడుతూ ఎన్టీపిసి ఉద్యోగుల హక్కులను యాజమాన్యం వద్ద తాకట్టు పెట్టింది ఐఎన్‌టియుసియేనని, అలాంటి యూనియన్‌కు గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఉద్యోగులంతా తగిన బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. ఎన్టీపిసి విద్యుత్ సంస్థకు చెందిన ఉద్యోగుల హక్కులను కాపాడేందుకే ఐక్య ఫ్రంట్‌గా ఆవిర్భవించామని, అలాంటి యూనియన్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్, ఎంపిపి ఆడేపు రాజేశం, ఐక్య ఫ్రంట్ నాయకులు పెద్దంపేట్ శంకర్, సత్యనారాయణ రెడ్డి, గోపాల్ రెడ్డి, మాధవరావు, కనకరాజ్, సారయ్య పాల్గొన్నారు.